BREAKING
*బొల్లారంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు* *కోహీర్ ప్రధాన రహదారికి కొత్త వెలుగులు.. ప్రజల భద్రతకు భరోసా!* హిట్ అయ్యే సినిమాలైనా వదులుకుంటా.. టాక్సిక్ లవ్‌పై ఆయుష్మాన్ ఖురానా ఆసక్తికర వ్యాఖ్యలు! హస్నాబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన దుబాయ్ పెళ్లి వేడుకలో హనీ సింగ్, అతీఫ్ అస్లాం స్టెప్పులు.. పాక్ కంటెంట్ వివాదం వేళ నెట్టింట రచ్చ! తేరే నామ్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు.. భోజ్‌పురి సినిమాతో మారిన దశ: రవి కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు! న్యాల్‌కల్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ - లబ్ధిదారుల్లో ఆనందం కాలుష్య కొరల్లో మల్లి పల్లి చేరువు వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు పడిగాపులు! ఉపాధి పనులను వేగవంతం చేయాలి.. -డీఆర్డీవో జయదేవ్ ఆర్య నిర్మాత డబ్బులు ఎగ్గొడితే టేప్ రికార్డర్ పట్టుకెళ్లా.. అక్షయ్ కుమార్ ఆసక్తికర కథ! ఇటాలియా టీ10 లీగ్‌లో విజయ్ శంకర్ జోరు.. వరుసగా రెండో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు! *ఇందిరమ్మ జీవిత బీమా పథకంను ప్రారంభంచిన గ్రామ సర్పంచ్ పిల్లి బాబు* పేదల సొంతింటి కలకు ఇందిరమ్మ ఇండ్లు.. కుటుంబ భవిష్యత్తుకు రూ.5 లక్షల బీమా భరోసా! యాసంగి సాగు విధానాలపై రైతులకు స్పష్టత ఇవ్వాలి

విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ..! - వ్యాపారవేత్త శ్రీనివాస్ గుప్తా..

Select Suryaa Now
విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ..!  - వ్యాపారవేత్త శ్రీనివాస్ గుప్తా..

దుబ్బాక;పేదలకు, విద్యార్థులకు సేవ చేయడం ఎంతో తృప్తినిస్తుందని, సంపాదనలో కనీసం 20 శాతం పేదలకు సేవ చేస్తే ఎంతో గుర్తింపు ఉంటుందని వ్యాపారవేత్త తడకమడ్ల శ్రీనివాస్ గుప్తా అన్నారు. బుధవారం తన తల్లి తండ్రి కిస్తమ్మ - విశ్వనాధంల 14వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని గంభీర్ పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు భోజనం ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సేవ చేయడంలో తృప్తి ఉంటుందని, ప్రతి ఒక్కరూ పేదలకు సేవ చేయాలని కోరారు. విద్యార్థులు మంచిగా చదివి ఉన్నత ర్యాంకులు సాధించి పాఠశాలకు మంచి పేరు తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాణాల సునంద - శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధవి,  గ్రామ పెద్దలు కరికె రాములు, అస రాజు, చేపూరి పరుశురాం గౌడ్, ఇంకా కనకయ్య, ప్రభాకర్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.