గ్రామ రజక సంఘం అధ్యక్షులుగా రాచకొండ కనకయ్య
కుకునూరుపల్లి;మండల కేంద్రమైన కుకునూరుపల్లి గ్రామ రజక సంఘం సభ్యులు బుధవారం సమావేశం నిర్వహించి రజక సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా రాచకొండ కనకయ్య ఉపాధ్యక్షులు శ్రీనివాస్ క్యాషియర్ ఎలాగారి భాస్కర్ లు ఎనుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ గ్రామ రజక సంఘం అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సంఘం అభివృద్ధిలో ముందుంటానని అన్నారు. సంఘం సభ్యులను కలుపుకొని సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రజక సంఘం అధ్యక్షులు ఎలాగారి బాలయ్య మాజీ అధ్యక్షులు ఎలాగారి కనకయ్య మాజీ ఉపాధ్యక్షులు చిన్న కనకయ్య మండల యువజన అధ్యక్షులు సందుల రమేష్ రాచకొండ శ్రీనివాస్ సందుల మల్లేశం ఎలాగారి ఆంజనేయులు సత్తయ్య స్వామి గణేష్ సత్తయ్య భూపాల్ శ్రీనివాస్ జగన్ సాగర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.