నైట్ కోర్టు కు వ్యతిరేకంగా కోర్టు విధులు బహిష్కరించిన…
దుబ్బాక;రాష్ట్ర ప్రభుత్వం నైట్ కోర్టుకు ఏర్పాటుకు చేయాలని తలపెట్టిన నిర్ణయానికి కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించి తమ నిరసనను వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజువారి కేసుల్లో తారతమ్యం ఏర్పడి, తమకు మరుసటి రోజు చూడవలసిన కేసులలో ఇబ్బందులు కలుగుతాయని న్యాయవాదులు తెలిపారు ఈ సందర్భంగా దుబ్బాక బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరిపెద్ది సంజీవరెడ్డి, ఏ జి పి నాగరాజు రెడ్డి, భాస్కర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, చిటికుల అశోక్, భైండ్ల చంద్రయ్య, కూరపాటి సంతోష్,బిక్షపతి, శ్రీనివాస్, శ్రీరాం రామకృష్ణ ప్రభు, బైండ్ల ప్రవీణ్ కుమార్, జ్ఞానేశ్వర్, మాడుగుల సంతోష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.