BREAKING
ఇంటి దొంగతనం కేసును ఛేదించిన ఘట్‌కేసర్ పోలీసులు.. 10 మంది అరెస్ట్‌, మరొకరు పరారీ ప్రముఖ క్రైస్తవుల సత్కారానికి నామినేషన్లు ఆహ్వానం:జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి ఎం. సుధీర్ మేదినిపూర్లో జీవిత బీమా పథకం ప్రారంభం ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన రూడా చైర్మన్ బాలవికాస్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ మంజూరు సర్పంచ్ సున్నం సుదర్శన్ దిర్సంపల్లిలో ఉచిత వైద్య శిబిరం నైట్ కోర్టు కు వ్యతిరేకంగా కోర్టు విధులు బహిష్కరించిన… ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి… కూటమి అభ్యర్థి ముమ్మర ప్రసారం అభివృద్ధి హామీలతో స్వతంత్రం అభ్యర్థి సత్యనారాయణ గ్రామ రజక సంఘం అధ్యక్షులుగా రాచకొండ కనకయ్య నాడు భూమి ఉంటేనే రైతు బీమా.. నేడు భూమి లేకున్నా కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబబీమా! క్రీడారంగంలో ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మరో ఘనత - కళాశాల చైర్మన్ .వెంకట రామిరెడ్డి *పల్లెలపై కోరలు చాస్తున్న ఫైనాన్స్ భూతం!* మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

*పల్లెలపై కోరలు చాస్తున్న ఫైనాన్స్ భూతం!*

Select Suryaa Now
*పల్లెలపై కోరలు చాస్తున్న ఫైనాన్స్ భూతం!*

జగదేవపూర్;సిద్ధిపేట జిల్లా పరిధిలోని గజ్వేల్, జగదేవపూర్, చేర్యాల్, మరుక్క్, మండల ప్రాంతాల్లో ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం రోజురోజుకూ విస్తరిస్తోంది. అత్యవసర అవసరాల కోసం డబ్బులు తీసుకుంటున్న సామాన్య ప్రజలు అధిక వడ్డీల భారంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా కొందరు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు నూటికి మూడు రూపాయల చొప్పున నెలవారీ వడ్డీ వసూలు చేస్తున్నారు.కుటుంబ అవసరాలు, వైద్య ఖర్చులు, వ్యవసాయ పెట్టుబడులు, పిల్లల చదువుల కోసం తమ సొంత భూములను రిజిస్ట్రేషన్ చేసి అప్పులు తీసుకుంటున్న ప్రజలు అధిక వడ్డీల కారణంగా అసలు కంటే వడ్డీనే ఎక్కువగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సమయానికి వడ్డీ చెల్లించలేని వారిపై ఒత్తిడి పెంచుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో కొందరు అప్పు తీర్చలేక ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. ఈ అప్పుల చక్రం నుంచి బయటపడలేక పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగాసతమతమవుతున్నాయి.ప్రాతాల్లో అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్న వారిపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై విచారణ చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలపై అధికారులు స్పందించి, గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ప్రత్యామ్నాయ రుణ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న అధికారులు. పలుమార్లు పలు పత్రికల్లో ఈ విషయమై ఎన్నోసార్లు ఎంతమందో రిపోర్టర్లు అధికార దృష్టికి రావాలని వార్తా రాయడం జరిగింది. కానీ ఇంతవరకు ఏ అధికారి దీనిపై ఎలాంటి చర్య తీసుకోలేదు.