BREAKING
ఇంటి దొంగతనం కేసును ఛేదించిన ఘట్‌కేసర్ పోలీసులు.. 10 మంది అరెస్ట్‌, మరొకరు పరారీ ప్రముఖ క్రైస్తవుల సత్కారానికి నామినేషన్లు ఆహ్వానం:జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి ఎం. సుధీర్ మేదినిపూర్లో జీవిత బీమా పథకం ప్రారంభం ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన రూడా చైర్మన్ బాలవికాస్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ మంజూరు సర్పంచ్ సున్నం సుదర్శన్ దిర్సంపల్లిలో ఉచిత వైద్య శిబిరం నైట్ కోర్టు కు వ్యతిరేకంగా కోర్టు విధులు బహిష్కరించిన… ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి… కూటమి అభ్యర్థి ముమ్మర ప్రసారం అభివృద్ధి హామీలతో స్వతంత్రం అభ్యర్థి సత్యనారాయణ గ్రామ రజక సంఘం అధ్యక్షులుగా రాచకొండ కనకయ్య నాడు భూమి ఉంటేనే రైతు బీమా.. నేడు భూమి లేకున్నా కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబబీమా! క్రీడారంగంలో ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మరో ఘనత - కళాశాల చైర్మన్ .వెంకట రామిరెడ్డి *పల్లెలపై కోరలు చాస్తున్న ఫైనాన్స్ భూతం!* మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

అభివృద్ధి హామీలతో స్వతంత్రం అభ్యర్థి సత్యనారాయణ

Select Suryaa Now
అభివృద్ధి హామీలతో స్వతంత్రం అభ్యర్థి సత్యనారాయణ

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

దొంతికుర్రు గ్రామ సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న విశ్రాంత డ్రాయింగ్ ఉపాధ్యాయుడు కాశీ వీర వెంకట సత్యనారాయణ (కేవీవీ) వినూత్న ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. తన ఎన్నికల గుర్తు 'మంచం'పై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తాను గెలిస్తే చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై స్పష్టమైన హామీలను ప్రజలకు వివరిస్తున్నారు.

దొంతికుర్రు గ్రామ పరిధిలో మౌలిక వసతుల కల్పన, సీసీ రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, గ్రామ పారిశుధ్యం, రక్షిత మంచినీటి సదుపాయం, హైస్కూల్ క్రీడా మైదానం మెరక, పాఠశాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇస్తున్నారు. అలాగే యువతకు స్టడీ కౌన్సెలింగ్ సెంటర్, విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రోత్సాహకాలు, గ్రంథాలయం ఏర్పాటు, మహిళల ఆర్థిక అభివృద్ధికి చర్యలు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తానని చెబుతున్నారు.

చిన్న కాలువలపై వంతెనల నిర్మాణం, ఉపాధి హామీ పథకం విస్తరణ, రైతుల సంక్షేమం, అర్హులకు పింఛన్లు, డ్వాక్రా మహిళల అభ్యున్నతి, స్వచ్ఛ గ్రామం వంటి కార్యక్రమాలతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ప్రజలకు భరోసా ఇస్తున్నారు. అవినీతికి తావులేని పాలన అందిస్తూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని, తనకు ఒక్క అవకాశం కల్పించాలని అభ్యర్థిస్తున్నారు.

గిడ్డివారిపేట, కమిడివారిపేట, మర్లచెరువు, కోతులచెరువు పుంత, గరువుపేట, గొల్లగూడెం, అడివిపేట తదితర ప్రాంతాల్లో ఒకటికి రెండుసార్లు పర్యటించి ఓటర్లను కలుస్తున్నారు. తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు.

36 ఏళ్లపాటు ఉపాధ్యాయుడిగా సేవలందించిన అనుభవం, విద్యావంతుడు, వినయశీలి, నిస్వార్థపరుడిగా ఉన్న గుర్తింపుతో ప్రజాసేవలోనూ రాణించగలరనే ఆశాభావాన్ని ఆయన మద్దతుదారులు వ్యక్తం చేస్తున్నారు. అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఆయనను పరిచయం చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు.

మంచం గుర్తు నమూనాలతో సరికొత్త పంథాలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తి ప్రజాసేవకు ముందుకు రావడాన్ని పలువురు ఓటర్లు స్వాగతిస్తున్నారు. అయితే గ్రామ ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది ఎన్నికల ఫలితాలే తేల్చనున్నాయి.