BREAKING
ఉపాధి పనులను వేగవంతం చేయాలి.. -డీఆర్డీవో జయదేవ్ ఆర్య నిర్మాత డబ్బులు ఎగ్గొడితే టేప్ రికార్డర్ పట్టుకెళ్లా.. అక్షయ్ కుమార్ ఆసక్తికర కథ! ఇటాలియా టీ10 లీగ్‌లో విజయ్ శంకర్ జోరు.. వరుసగా రెండో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు! *ఇందిరమ్మ జీవిత బీమా పథకంను ప్రారంభంచిన గ్రామ సర్పంచ్ పిల్లి బాబు* పేదల సొంతింటి కలకు ఇందిరమ్మ ఇండ్లు.. కుటుంబ భవిష్యత్తుకు రూ.5 లక్షల బీమా భరోసా! యాసంగి సాగు విధానాలపై రైతులకు స్పష్టత ఇవ్వాలి దీక్ష దివస్ పోస్టర్ ఆవిష్కరణ ఉపాధి పనులలో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదు.....… బాల్యవివాహాల నిర్మూలనకు విద్యార్థుల గళం! జగన్ తన కిరాయి రచయితలతో ప్రజాతీర్పును అవమానిస్తున్నారు : టీడీపీ నేత గురజాల మాల్యాద్రి విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ..! - వ్యాపారవేత్త శ్రీనివాస్ గుప్తా.. వర్గల్ నవోదయ ప్రవేశ పరీక్షకు చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు మేదినిపూర్లో జీవిత బీమా పథకం ప్రారంభం ఇంటి దొంగతనం కేసును ఛేదించిన ఘట్‌కేసర్ పోలీసులు.. 10 మంది అరెస్ట్‌, మరొకరు పరారీ ప్రముఖ క్రైస్తవుల సత్కారానికి నామినేషన్లు ఆహ్వానం:జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి ఎం. సుధీర్

దిర్సంపల్లిలో ఉచిత వైద్య శిబిరం

Select Suryaa Now
దిర్సంపల్లిలో ఉచిత వైద్య శిబిరం

దోమ, మేజర్ న్యూస్: దిర్సంపల్లి గ్రామంలో ఐజీఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి వెంకట్ రాములు ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు గ్రామస్తులకు జనరల్ ఫిజీషియన్ పరీక్షలతో పాటు బీపీ, కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గ్రామంలోనే ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ శిబిరంలో గ్రామ కార్యదర్శి, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన ఐజీఎఫ్ సంస్థ ప్రతినిధులకు, వైద్య బృందానికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.