BREAKING
జిల్లాలో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ భారీగా ఓటింగ్‌లో పాల్గొన్న ప్రజలు – సాయంత్రంలోగా ఫలితాల వెల్లడికి చర్యలు భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ గొప్పతనం రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – కలెక్టర్ హిమాన్షు శుక్లా ఎంపీ వద్దిరాజు తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించారు* ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలి గైర్హాజరైతే క్రమశిక్షణా చర్యలు తప్పవు – కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు కలెక్టరేట్ (మేజర్ న్యూస్) అక్కంపల్లిలో కూటమి మద్దతుదారుడు అంజన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపు 3 వేల మందితో టిడిపి లో చేరిన తిరుమల వైసిపి నేత ప్రవీణ్ రాయల్ మేయర్ జె బి శ్రీనివాస్ నాయకత్వంలో పనిచేయడానికి చేరా... దివాలా పునర్వ్యవస్థీకరణలో ఎయిర్‌బాల్టిక్.. దూబగుంట పాఠశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది -అంబేద్కర్ లా కళాశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం కాంగోలో ఎబోలా మహమ్మారి తీవ్రరూపం.. 12 వేలకుపైగా కేసులు, 5,904 మంది మృతి: హెల్తీ విలేజ్ ఫుడ్ వింగర్ బీన్స్..! -దక్షిణాసియాలో లభించే మొక్క..!! -ప్రస్తుతం పెద్దచెరుకూరులో సాగు..!!! (తోటపల్లిగూడూరు, మేజర్ న్యూస్) అమెరికా సహకారంతో కెన్యాలో నిర్మిస్తున్న ఎబోలా నిర్బంధ కేంద్రానికి న్యాయస్థానం అడ్డుకట్ట: చైనా కృత్రిమ మేధ సంస్థ 'మినీమ్యాక్స్'పై డేటా భద్రతా ఆందోళనలు.. సోషల్ మీడియాలో పోస్టుల నియంత్రణ.. మెటాపై ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్.. సీఎం చంద్రబాబును కలిసిన కార్పొరేటర్ విజయ మునిశేఖర్ రాయల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో అలింకో శిబిరాలకు విశేష స్పందన

Select Suryaa Now
హుస్నాబాద్ నియోజకవర్గంలో అలింకో శిబిరాలకు విశేష స్పందన

హుస్నాబాద్;సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా వృద్ధులు, దివ్యాంగులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అలింకో సంస్థ సహకారంతో నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి, అర్హులైన వృద్ధులు, దివ్యాంగులను గుర్తించి వారికి అవసరమైన సహాయక పరికరాలను అందించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన అలింకో శిబిరానికి విశేష స్పందన లభించింది. గ్రామాల వారీగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి లబ్ధిదారులను శిబిరానికి తరలించారు. ఈ శిబిరాల్లో అర్హతను పరిశీలించి అవసరాన్ని బట్టి మూడు చక్రాల సైకిళ్లు, వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు, చేతికర్రలు, వాకింగ్ స్టిక్స్, వాకర్స్, కృత్రిమ అవయవాలు, కాలిపర్స్ తదితర సహాయక పరికరాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి మాట్లాడుతూ శిబిరానికి మంచి స్పందన లభించిందని, గ్రామాల సర్పంచుల సహకారంతో పెద్ద సంఖ్యలో వృద్ధులు, దివ్యాంగులు తరలివచ్చారని తెలిపారు. ఈ శిబిరాల ద్వారా అర్హులైన ఎంతోమందికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు గ్రామ సర్పంచులు కార్యదర్శులు కాంగ్రెస్ పార్టీ నాయకులు  దివ్యాంగులు వృద్ధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.