*ఇటిక్యాలలో అనుమతి లేకుండా మత ప్రచారం.. స్థానికుల ఆందోళన*
జగదేవపూర్;సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో అనుమతి లేకుండా పెద్ద సంఖ్యలో వ్యక్తులు వచ్చి అన్యమత(క్రిస్టియన్) ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. కొందరు వ్యక్తులు గ్రామంలో కరపత్రాలు పంపిణీ చేస్తూ మత ప్రచారం నిర్వహించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఈ సందర్భంగా హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ప్రచారం చేశారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర మతాల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అదే సమయంలో తమ మత విశ్వాసాలను కించపరిచే వ్యాఖ్యలు చేయడం సరికాదని స్థానికులు పేర్కొంటున్నారు అనుమతుల అంశాన్ని పరిశీలించి, మత విద్వేషాలకు దారితీసే వ్యాఖ్యలు నిజంగా చోటుచేసుకున్నాయా అనే విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తు సబ్ ఇన్స్పెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. గ్రామంలో శాంతిభద్రతలు, మత సామరస్యం కాపాడేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.