BREAKING
క్రీక్ విద్యార్థులచే ప్రపంచ సంస్కృతుల వైభవం ఇంపీరియల్ బ్రాండ్స్ కొనుగోలుపై ఆల్ట్రియా కసరత్తు ప్రొ.వి.బాల కిష్టా రెడ్డికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రధానం. ఈసీబీ వడ్డీ రేట్ల పెంపునకు అక్టోబర్ సమావేశంలోనే భారీ మద్దతు 9వ వార్డులో సాయిబాబా ఎన్నికల ప్రచారం వాణిజ్య ఒప్పందాలు, చైనా, భారత్‌పై ప్రభావంపై కీలక అంశాలు బ్రెజిల్ ఆర్థిక మంత్రి పదవిపై లూలా దృష్టి పంటల్లో సమగ్ర పోషకాల యాజమాన్యంపై రైతులకు శిక్షణ అధిక దిగుబడుల సాధనకు శాస్త్రీయ సాగు పద్ధతులు పాటించాలి: వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ అచ్చుతరాజు రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన .... - చందనపూర్ జెడ్పీహెచ్ఎస్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఈయూ బడ్జెట్‌పై మెలోని కఠిన వైఖరి ఇఫ్ఫీ 2026లో సరస్వతీ నది రహస్యంపై డాక్యుమెంటరీ ఇఫ్ఫీ 2026లో కిర్గిజ్ చిత్రం స్కైలార్క్ దేశ సాంస్కృతిక, సృజనాత్మక వైభవానికి వేదికగా గోవా ప్రాంగణం తాగునీరు, కాలువ వ్యవస్థ మెరుగుదలకు చర్యలు తీసుకోవాలి.… ఇంజినీరింగ్ అధికారుల సమావేశంలో మేయర్ భార్గవి యువకుడు అదృశ్యం

తపాలా శాఖ మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు రూ. 1,491 కోట్లు

Select Suryaa Now
తపాలా శాఖ మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు రూ. 1,491 కోట్లు

సూర్య జాతీయ డెస్క్: తపాలా శాఖ మౌలిక సదుపాయాల ఆధునికీకరణ కోసం రూ. 1,491 కోట్ల ఆర్థిక వ్యయంతో ఎస్టేట్స్ మేనేజ్‌మెంట్ స్కీమ్ కొనసాగింపునకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. పదహారో ఆర్థిక సంఘం చక్రంలో భాగంగా 2026-27 నుంచి 2030-31 వరకు ఐదేళ్ల కాలానికి ఈ సెంట్రల్ సెక్టార్ పథకం అమలు కానుంది. తపాలా కార్యాలయాలు, నివాస కాలనీల నూతన నిర్మాణం, పునర్నిర్మాణం, పునరుద్ధరణ, ఏకరూప బ్రాండింగ్‌తో పాటు చారిత్రక వారసత్వ తపాలా భవనాల పరిరక్షణ, సాంకేతిక మౌలిక సదుపాయాల అభివృద్ధి ఈ పథకంలో కీలక అంశాలుగా ఉన్నాయి. డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఆర్థిక చేరిక, పౌర సేవల పంపిణీని మరింత బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద తపాలా నెట్‌వర్క్‌లలో ఒకటైన ఇండియా పోస్ట్ పరిధిలో 1.65 లక్షల పోస్టాఫీసులు ఉండగా, వాటిలో 1,49,385 గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి. తపాలా సేవలు, బ్యాంకింగ్, బీమా, ఆధార్ సేవలు, పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, డాక్‌ఘర్ నిర్యాత్ కేంద్రాల ద్వారా గ్రామీణ కళాకారులకు తోడ్పాటు వంటి సేవలను ఈ నెట్‌వర్క్ అందిస్తోంది. ఈ పథకం కింద శాఖకు చెందిన ఖాళీ స్థలాలలో 190 కొత్త తపాలా భవనాల నిర్మాణానికి రూ. 280 కోట్లు కేటాయించారు. దీనివల్ల అద్దె భవనాలపై ఆధారపడటం తగ్గి, అద్దె ఖర్చులు ఆదా అవుతాయి. శిథిలావస్థలో ఉన్న 50 తపాలా భవనాలను కూల్చివేసి కొత్తగా నిర్మించేందుకు రూ. 108 కోట్లు, 2,550 సబ్ పోస్టాఫీసుల ఆధునికీకరణ, బ్రాండింగ్‌కు రూ. 318 కోట్లు, అద్దె భవనాలలో నడుస్తున్న 2,500 పోస్టాఫీసుల ఉన్నతీకరణ, బ్రాండింగ్‌కు రూ. 37.50 కోట్లు ఖర్చు చేయనున్నారు.

చారిత్రక ప్రాధాన్యత కలిగిన 20 వారసత్వ తపాలా భవనాల పరిరక్షణకు రూ. 180 కోట్లు, అధిక డిమాండ్ ఉన్న 150 తపాలా నివాస కాలనీల పునరుద్ధరణకు రూ. 357.50 కోట్లు కేటాయించారు. సౌర విద్యుత్, వర్షపు నీటి సంరక్షణ వంటి సుస్థిర సౌకర్యాలు, సుగమ్య భారత్ అభియాన్ కింద ర్యాంపులు, బ్రెయిలీ సూచికలతో పాటు మహిళా టాయిలెట్లు, ఫీడింగ్ రూమ్‌ల కల్పన కోసం రూ. 100 కోట్లు వెచ్చించనున్నారు.

బెంగళూరులోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ కోసం శాశ్వత భౌతిక మౌలిక సదుపాయాల కల్పనకు మరో రూ. 100 కోట్లు కేటాయించారు. దీనిద్వారా అధునాతన తపాలా సాంకేతిక సేవలు, స్వదేశీ ఓపెన్ సోర్స్ టెక్ స్టాక్ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుంది. ఐదేళ్ల దశలవారీ అమలు ద్వారా తపాలా శాఖ మౌలిక సదుపాయాలు మరింత ఆధునికంగా, పౌరులకు చేరువయ్యేలా మారనున్నాయి.