9వ వార్డులో సాయిబాబా ఎన్నికల ప్రచారం
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: భట్టిప్రోలు గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా ఈనెల 29న జరిగే ఎన్నికల కు సంబంధించి మండల కేంద్రమైన భట్టిప్రోలు లో 9వ వార్డులో పోటీ చేయుచున్న అభ్యర్థి మామిడి స్వాతిని గెలిపించాలని అభ్యర్థిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకుడు తూనుగుంట్ల సాయిబాబా గురువారం ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. పంచాయతీ ఏరియాలో గతంలో చేసిన అభివృద్ధి పనులు, రానున్న రోజుల్లో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు సూచనల మేర జరగవలసిన పనులను వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను ఇంటింటికీ తిరిగి పంపిణీ చేసి ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన భట్టిప్రోలు గ్రామ సర్పంచ్ తుపాకుల సమత, ఒక్కడాల ఆనంద్, డాక్టర్ మామిడి రవి, యార్లగడ్డ పాండురంగారావు, పునుగుపాటి పున్నారావు, ఆదిన తాండవ కృష్ణ. కూటమి పార్టీల శ్రేణులు పాల్గొన్నారు.