శివరాంపురంలో వైసీపీకి భారీ షాక్
పార్టీ అభివృద్ధి కి గ్రామ అభ్యున్నతికి కృషి చేయాలి.
శివరాంపురంలో వైసీపీకి భారీ షాక్.
వైకాపా ను వీడి టీడీపీలో చేరిన 45 కుటుంబాలు.
డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు
సూర్య న్యూస్ దర్శి.తాళ్లూరు మండలంలోని శివరాంపురం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన 45 వైసీపీ కుటుంబాలు ఆ పార్టీని వీడి దర్శి టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. దర్శి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శివరాంపురం గ్రామ టీడీపీ నాయకుల సమక్షంలో
ఈ చేరికల కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ వారికి పార్టీ కండువాలు కప్పి, సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి, గ్రామ అభ్యున్నతికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, కూటమి ప్రభుత్వ పాలనపై విశ్వాసంతో పార్టీలో చేరిన వారందరికీ తగిన గుర్తింపు, గౌరవం కల్పిస్తామని తెలిపారు. ఆ గ్రామానికి
అనపర్తి సిద్దయ్య, కొండ్రా భాస్కర్ రావు, కొండ్ర మహేష్, కొండ్రా అనిల్ కుమార్, అనపర్తి బ్రహ్మయ్య, అనపర్తి ప్రసంగి, అనపర్తి శేషయ్య, అనపర్తి శ్రీను, రమేష్, అనపర్తి మహేష్, అనపర్తి బుజ్జి, అనపర్తి శ్రీను, అనపర్తి చిన్న బ్రహ్మయ్య, అనపర్తి విష్ణు, అనపర్తి నాగేశ్వరావు, అనపర్తి ఈశ్వరయ్య, అనపర్తి చిన్న శేషయ్య, అనపర్తి పెద్ద శాంతయ్య, అనపర్తి కోటేష్, అనపర్తి మోషే, అనపర్తి చిన్న రావులు, అనపర్తి మరియదాసు, అనపర్తి ఆదేయ్య, అనపర్తి రాజశేఖర్, అనపర్తి చిన్న, అనపర్తి మోషే, అనపర్తి కృష్ణ, అనపర్తి రూబేను, అనపర్తి పెద్ద రాములు, అనపర్తి చిన్నోడు, అనపర్తి చిన్న ఈశ్వరయ్య, అనపర్తి ఏలియా, అనపర్తి మాస్, అనపర్తి క్రాంతి కుమార్, తేల్ల ఎలీషా, తేల్ల పెద్దతిరిపాలు, రావిపాటి బ్రహ్మయ్య, అనపర్తి అశోక్, అనపర్తి ఇమ్మానుయేలు, రావిపాటి శివ, రావిపాటి గణేష్, తేల్ల చిన్న తిరుపాలు, అనపర్తి అహోషువ, శీలం ముసలయ్య తదితరులు వైసీపీని వీడి టిడిపిలో చేరారు.