BREAKING
బ్రిటిష్ పౌండ్ స్థిరత్వం.. అమెరికా డాలర్ ర్యాలీకి బ్రేక్ స్విట్జర్లాండ్‌లో ఐదు సైబర్ దాడులలో ఏఐ ఏజెంట్ల వినియోగం ఫిఫాపై సైబర్ దాడి ఇరాన్ యుద్ధం, ఇంధన ధరల షాక్.. ఆర్థిక సంక్షోభంలో విమానయాన సంస్థలు ఫుడ్ సేఫ్టీ పై అవగాహన కార్యక్రమాలు" రాజ్యాంగ దినోత్సవ వేడుకలు " టెక్సాస్ జడ్జి నామినేషన్‌లో ట్రంప్ కీలక మార్పు పిరాట్లంక అభివృద్ధే కూటమి లక్ష్యం గ్రామ ప్రగతికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి: కమతం సాంబశివరావు సమాజంలో ప్రతి పౌరుడు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి ప్రజాస్వామ్య పరిరక్షణలో పౌరుల పాత్ర కీలకం ఆర్డీఓ బి. శ్రీదేవి రబీ సీజన్‌లో అర్హులైన రైతులందరూ గడువులోగా పంటల బీమా నమోదు చేసుకోవాలి* *డిసెంబర్ మొదటి వారం లోపు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి* *క్రాప్ ఇన్సూరెన్స్ యాప్ ద్వారా ఇంటి నుంచే ఉచితంగా నమోదు చేసుకునే అవకాశం* *ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* గుడివాడ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్డీవోలు పోలీస్ బడిలోని 42/2 పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన జి. బాలసుబ్రహ్మణ్యం, బి. శ్రీదేవి కృష్ణా జలాల విషయంలో పొరపాటు జరిగింది.. రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ పీఠిక పఠనం.. ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం మెటా స్మార్ట్ గ్లాసెస్ విక్రయాలపై నిషేధం కోరుతూ కోర్టుకెక్కిన డచ్ సంస్థలు

రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి ప్రజాస్వామ్య పరిరక్షణలో పౌరుల పాత్ర కీలకం ఆర్డీఓ బి. శ్రీదేవి

Select Suryaa Now
రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి ప్రజాస్వామ్య పరిరక్షణలో పౌరుల పాత్ర కీలకం  ఆర్డీఓ బి. శ్రీదేవి

రేపల్లె మేజర్ న్యూస్:, భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అని, రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు ప్రతి పౌరుడు తన విధులు, బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారి బి. శ్రీదేవి పేర్కొన్నారు. రాజ్యాంగం అందరికీ సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి గొప్ప విలువలను అందించిందని, వాటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె అన్నారు.భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం రేపల్లె ఆర్డీఓ కార్యాలయంలో  రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్డీవో శ్రీదేవి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా కొనసాగాలంటే పౌరులు రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని, హక్కుల గురించి తెలుసుకోవడంతో పాటు రాజ్యాంగం నిర్దేశించిన విధులను కూడా బాధ్యతాయుతంగా పాటించాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ప్రజలకు సేవలందించే విషయంలో రాజ్యాంగ విలువలకు అనుగుణంగా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆర్డీఓ బి. శ్రీదేవి కార్యాలయ అధికారులు, సిబ్బందితో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగ ఆశయాలను గౌరవిస్తూ దేశ ఐక్యత, సమగ్రత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో రేపల్లె ఆర్డీఓ కార్యాలయ అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.