BREAKING
బ్రిటిష్ పౌండ్ స్థిరత్వం.. అమెరికా డాలర్ ర్యాలీకి బ్రేక్ స్విట్జర్లాండ్‌లో ఐదు సైబర్ దాడులలో ఏఐ ఏజెంట్ల వినియోగం ఫిఫాపై సైబర్ దాడి ఇరాన్ యుద్ధం, ఇంధన ధరల షాక్.. ఆర్థిక సంక్షోభంలో విమానయాన సంస్థలు ఫుడ్ సేఫ్టీ పై అవగాహన కార్యక్రమాలు" రాజ్యాంగ దినోత్సవ వేడుకలు " టెక్సాస్ జడ్జి నామినేషన్‌లో ట్రంప్ కీలక మార్పు పిరాట్లంక అభివృద్ధే కూటమి లక్ష్యం గ్రామ ప్రగతికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి: కమతం సాంబశివరావు సమాజంలో ప్రతి పౌరుడు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి ప్రజాస్వామ్య పరిరక్షణలో పౌరుల పాత్ర కీలకం ఆర్డీఓ బి. శ్రీదేవి రబీ సీజన్‌లో అర్హులైన రైతులందరూ గడువులోగా పంటల బీమా నమోదు చేసుకోవాలి* *డిసెంబర్ మొదటి వారం లోపు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి* *క్రాప్ ఇన్సూరెన్స్ యాప్ ద్వారా ఇంటి నుంచే ఉచితంగా నమోదు చేసుకునే అవకాశం* *ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* గుడివాడ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్డీవోలు పోలీస్ బడిలోని 42/2 పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన జి. బాలసుబ్రహ్మణ్యం, బి. శ్రీదేవి కృష్ణా జలాల విషయంలో పొరపాటు జరిగింది.. రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ పీఠిక పఠనం.. ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం మెటా స్మార్ట్ గ్లాసెస్ విక్రయాలపై నిషేధం కోరుతూ కోర్టుకెక్కిన డచ్ సంస్థలు

సమాజంలో ప్రతి పౌరుడు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

Select Suryaa Now
సమాజంలో ప్రతి పౌరుడు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి*  *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

కర్నూలు, నవంబర్ 26:-  సమాజంలో ప్రతి పౌరుడు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు..

గురువారం కలెక్టరేట్ లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ భారత రాజ్యాంగ పీఠికను చదివి అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26న రాజ్యాంగ సభ ఆమోదించిందని, 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని కలెక్టర్ తెలిపారు..నవంబర్ 26 న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటారన్నారు. ఈ రెండు చారిత్రాత్మక తేదీలు భారత ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఎంతో ప్రాముఖ్యత కలిగినవన్నారు. రాజ్యాంగ రూపకల్పనలో డా.బి.ఆర్.అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని పేర్కొంటూ, ఆయన అధ్యక్షతన పనిచేసిన ముసాయిదా కమిటీలో సభ్యులుగా ఉండి, రాజ్యాంగ నిర్మాణంలో విశేష కృషి చేసిన ఎన్. గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కె.ఎం. మున్షీ, సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా, బి.ఎల్. మిట్టర్, డి.పి. ఖైతాన్ తదితర మహనీయుల సేవలు చిరస్మరణీయమన్నారు.

డా.బాబా సాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యంగంలో పౌరుల మౌలిక హక్కులు, విధులు, బాధ్యతలు, స్వేచ్ఛ,సమానత్వం, ఆర్థిక,సామాజిక న్యాయం వంటి అంశాలను స్పష్టంగా పొందుపరచి ఒక గ్రంథంగా మనకు అందించారని  కలెక్టర్ పేర్కొన్నారు.. రాజ్యాంగం దేశ ప్రజలకు ఉన్న అత్యున్నత గ్రంథం అని, అందులో పేర్కొన్న న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను ప్రతి పౌరుడు గౌరవించి ఆచరించాలన్నారు. ప్రజాస్వామ్య బలపరచడంలో ప్రతి పౌరుడు తన పాత్రను నిర్వర్తించాల్సిన అవసరాన్ని కలెక్టర్  గుర్తుచేశారు.. డా.బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా నిర్దేశించిన  విలువలను పాటిస్తూ, వారి ఆశయాలను సాధించేలా ముందుకు వెళ్ళాలని కలెక్టర్ పిలుపునిచ్చారు..

అంతకముందు కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ భారత రాజ్యాంగ పీఠికను చదివి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనురాధ, కలెక్టరేట్ ఏఓ రవి కుమార్, సూపరింటెండెంట్ శ్రీనాథ్, కలెక్టరేట్ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు...

కార్యక్రమంలో  డిఆర్డిఏ పిడి శ్రీధర్ రావు, డి ఈ ఓ సుధాకర్, సర్వ శిక్ష అభియాన్ పిఓ లోకరాజ్, తదితరులు పాల్గొన్నారు..