BREAKING
ఆదిమూర్తిపల్లె పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి చింతంరెడ్డి తిరుమల రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ అంబేద్కర్, పూలే భవనాన్ని నిర్మించాలని నిరసన జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన చప్పిడి జ్ఞానేశ్వర్ కోడుమూరు స్నేహ వృద్ధాశ్రమానికి యూఎస్‌టీ సంస్థ చేయూత వృద్ధులకు నిత్యావసర వస్తువులు, వైద్య సహాయక పరికరాల అందజేత గుండెపోటుతో మృతి చెందిన కుటుంబ సభ్యులకు పరామర్శ.. అలియాస్ రుక్మిణి గుర్తుండిపోయే సినిమా.. నితిన్ క్యారెక్టర్‌పై దీప్తి గంటా ఆసక్తికర వ్యాఖ్యలు ఇంకొల్లు ఉప సర్పంచ్‌గా పాలేరు రామకృష్ణ జనవరి 12 విడుదల మూవీ డబ్బింగ్ షురూ.. సంక్రాంతి బరిలో వెంకటేష్, కల్యాణ్ రామ్ సందడి మిట్స్‌లో ఘనంగా ముగిసిన ఉపాధి నైపుణ్య శిక్షణ కార్యక్రమం : హాజరైన మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ శిక్షకురాలు సంధ్య శ్రీనివాసన్ బోయినపల్లిలో విషాదం: మైనర్ నడిపిన ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి..! జాతీయస్థాయి క్రికెట్ పోటీల్లో మదనపల్లి యువకుల ప్రతిభ : అభినందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇంకొల్లు గ్రామ పంచాయితి సర్పంచ్‌గా షేక్‌ మహ్మద్‌ రఫి రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ బాస్కెట్‌బాల్ పోటీలకు రిడ్జ్ విద్యార్థులు ఎంపిక* తిరుపతయ్య పాదయాత్రకు కేసీఆర్ అభినందన

రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ పీఠిక పఠనం.. ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం

Select Suryaa Now
రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ పీఠిక పఠనం.. ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం

రేపల్లె మేజర్ న్యూస్; భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపల్లె పట్టణంలోని తాలూకా అంబేద్కర్ విగ్రహం వద్ద భీమ్ ఆర్మీ యూత్, అంబేద్కర్, దళిత, సామాజిక ప్రజాసంఘాల నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ పీఠికను సామూహికంగా పఠించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకల్పన కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగ పరిషత్ సభ్యులు సుదీర్ఘకాలం కృషి చేశారని తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించారని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి నేటితో 77 సంవత్సరాలు పూర్తయ్యాయని తెలిపారు. సమానత్వానికి రాజ్యాంగమే పునాది భారత రాజ్యాంగం అమలులోకి రావడం ద్వారా దేశంలోని ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి ప్రాథమిక విలువలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. కుల, మత, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించిన ఘనత భారత రాజ్యాంగానిదేనని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకుంటూ, అందులో పొందుపరిచిన ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆరో వార్డు భీమ్ ఆర్మీ యూత్ సభ్యులతో పాటు అంబేద్కర్, దళిత, సామాజిక సంఘాల ప్రతినిధులు సీహెచ్. మణిలాల్, దారం సాంబశివరావు, దోవా రమేష్ రాంజీ, ఏ. కిరణ్, సీహెచ్. ప్రకాష్, పి. నాని, నవీన్, శశి, రవి, ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు.