చేనేత నేత ప్రగడ కోటయ్య చిరస్మరణీయులు --ఎంపీపీ సౌమ్యశ్రీ
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: చేనేత బంధువులకు ఎనలేని కృషిచేసిన చేనేత బందు స్వర్గీయ ప్రగడ కోటయ్య చిరస్మరణీయులని భట్టిప్రోలు ఎంపీపీ గాత్రం సౌమ్యశ్రీ అన్నారు. చేనేత నేత ప్రగడ కోటయ్య 31 వ వర్ధంతి వేడుక ను
వేమూరు నియోజకవర్గం మండల కేంద్రమైన భట్టిప్రోలు లో గురువారం భట్టిప్రోలు మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు గాత్రం సౌమ్యశ్రీ ఆధ్వర్యంలో ప్రగడ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక రథం సెంటర్లో నున్న ప్రగడ కోటయ్య నిలువెత్తు విగ్రహానికి ఎంపీపీ సౌమ్యశ్రీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ప్రగడ కోటయ్య విగ్రహం ప్రక్కన ఏర్పాటుచేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహానికి, కాపు నేత సంకటి శివ నాగయ్య విగ్రహాలకు ఆమె పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గాత్రం భావనారాయణ, కటకం సాంబశివరావు, కౌతరపు పిచ్చయ్య శాస్త్రి, వడ్లమూడి నాగేశ్వరరావు, కుంచే వెంకటేశ్వరరావు పలువురు చేనేత నాయకులు పాల్గొన్నారు.