ముదిగుబ్బలో ఫ్యాన్ జోరు
స్థానిక పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గురువారం మండల పరిధిలోని 25 గ్రామపంచాయతీలో నిర్వహించిన ఎన్నికలలో వైసిపి మద్దతుదారుల జోరు కొనసాగుతోంది. సాయంకాలం 7 గంటల వరకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు వైసిపి తొమ్మిది పంచాయతీలు, టిడిపి మద్దతుదారులు మూడు పంచాయతీలు, బిజెపి మద్దతుదారు ఒకరు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు ఒకరు విజయం సాధించారు. మిగిలిన పంచాయతీల వివరాలు అందాల్సి ఉంది.