BREAKING
ఆదిమూర్తిపల్లె పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి చింతంరెడ్డి తిరుమల రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ అంబేద్కర్, పూలే భవనాన్ని నిర్మించాలని నిరసన జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన చప్పిడి జ్ఞానేశ్వర్ కోడుమూరు స్నేహ వృద్ధాశ్రమానికి యూఎస్‌టీ సంస్థ చేయూత వృద్ధులకు నిత్యావసర వస్తువులు, వైద్య సహాయక పరికరాల అందజేత గుండెపోటుతో మృతి చెందిన కుటుంబ సభ్యులకు పరామర్శ.. అలియాస్ రుక్మిణి గుర్తుండిపోయే సినిమా.. నితిన్ క్యారెక్టర్‌పై దీప్తి గంటా ఆసక్తికర వ్యాఖ్యలు ఇంకొల్లు ఉప సర్పంచ్‌గా పాలేరు రామకృష్ణ జనవరి 12 విడుదల మూవీ డబ్బింగ్ షురూ.. సంక్రాంతి బరిలో వెంకటేష్, కల్యాణ్ రామ్ సందడి మిట్స్‌లో ఘనంగా ముగిసిన ఉపాధి నైపుణ్య శిక్షణ కార్యక్రమం : హాజరైన మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ శిక్షకురాలు సంధ్య శ్రీనివాసన్ బోయినపల్లిలో విషాదం: మైనర్ నడిపిన ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి..! జాతీయస్థాయి క్రికెట్ పోటీల్లో మదనపల్లి యువకుల ప్రతిభ : అభినందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇంకొల్లు గ్రామ పంచాయితి సర్పంచ్‌గా షేక్‌ మహ్మద్‌ రఫి రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ బాస్కెట్‌బాల్ పోటీలకు రిడ్జ్ విద్యార్థులు ఎంపిక* తిరుపతయ్య పాదయాత్రకు కేసీఆర్ అభినందన

పంటల్లో సమగ్ర పోషకాల యాజమాన్యంపై రైతులకు శిక్షణ అధిక దిగుబడుల సాధనకు శాస్త్రీయ సాగు పద్ధతులు పాటించాలి: వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ అచ్చుతరాజు

Select Suryaa Now
పంటల్లో సమగ్ర పోషకాల యాజమాన్యంపై రైతులకు శిక్షణ అధిక దిగుబడుల సాధనకు శాస్త్రీయ సాగు పద్ధతులు పాటించాలి: వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ అచ్చుతరాజు

రేపల్లె మేజర్ న్యూస్; రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించి, పంటల్లో అధిక దిగుబడులు సాధించడమే లక్ష్యంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) సౌజన్యంతో గురువారం రేపల్లె మండలం పేటేరు గ్రామంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 2026–27 సంవత్సరానికి సంబంధించి వివిధ పంటల్లో సమగ్ర పోషకాల యాజమాన్యంపై రైతులకు ఆచరణాత్మక శిక్షణ అందించారు.ఈ సందర్భంగా డాట్ సెంటర్ సమన్వయకర్త వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కె. అచ్చుతరాజు మాట్లాడుతూ వరి, మినుము, పెసర, మొక్కజొన్న పంటల్లో సమగ్ర పోషకాల యాజమాన్యం ఎంతో కీలకమని తెలిపారు. పంటల ఎదుగుదలకు అవసరమైన ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మపోషకాలను సరైన మోతాదులో వినియోగించడం ద్వారా ఆరోగ్యకరమైన మొక్కల పెరుగుదల, నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని వివరించారు. ఆయా పంటలకు అనువైన అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఎంపిక చేసుకోవాలని, శాస్త్రీయ సాగు పద్ధతులు పాటించాలని రైతులకు సూచించారు.
ఏడీఏ వి. రమేష్ బాబు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద అమలవుతున్న పంటల బీమా పథకం గురించి వివరించారు. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలతో పంట నష్టాలు సంభవించినప్పుడు రైతులకు బీమా ద్వారా కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. రైతులు పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారి అవ్వారు మహేష్ బాబు మాట్లాడుతూ ఎరువుల విక్రయాల్లో పారదర్శకత, రైతులకు సులభంగా ఎరువుల అందుబాటు కోసం ప్రవేశపెట్టిన ఎఫ్ఎఫ్ఎస్ యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. రైతులు ఈ విధానాన్ని అనుసరించి ఎరువుల కొనుగోలు ప్రక్రియను సక్రమంగా వినియోగించుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు పావని, సుమంత్, గ్రామ వ్యవసాయ సహాయకులు, మండల పరిషత్ వ్యవసాయ అధికారులు (ఎంపీఈఓ) ప్రసాద్, పలువురు రైతులు పాల్గొన్నారు.