telangana
ప్రొ.వి.బాల కిష్టా రెడ్డికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రధానం.
హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ :రాజ్యాంగం అనేది మన జీవితంలో, మన హక్కుల్లో బాధ్యతల్లో భాగమని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్టి రజిని అన్నారు. గురువారం తెలంగాణ మేధావుల పురం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మాసాబ్ ట్యాంక్ లోని తెలంగాణ ఉన్నత విద్యా మండలి మీటింగ్ హాలులో భారత్ 77 వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ప్రముఖ న్యాయ ప్రొఫెసర్, తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్ట రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ ముందుకు సాగుతామని అన్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ సీనియర్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఇటికల పురుషోత్తం మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన దేశానికి దిశా నిర్దేశం చేసింది భారత రాజ్యాంగమని, రాజ్యాంగం మన హక్కులను రక్షణ కవచం లాంటిదని తెలిపారు. L ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్య మండలి సెక్రెటరీ ప్రొ. శ్రీరామ్ వెంకటేష్ ,ప్రొ. షకీలా, ఓయూ అడ్మిషన్స్ జాయింట్ డైరెక్టర్ అడ్మిషన్స్, డాక్టర్ మొహమ్మద్ అక్తర్ అలీ, తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్, ఉపాధ్యక్షులు కుంబర్తి రవీంద్ర, ఓయూ రిసోర్స్ స్కాలర్ ఎన్ఎస్ఎస్ మోటివేటర్ డాక్టర్ రవితేజ విద్యావేత్త లైన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, కోఆర్డినేటర్లు బుచ్చుకారి సూర్య, గడ్డమీది వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ ప్రొఫెసర్, తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాల కిష్టా రెడ్డికి రాష్ట్రం నుండి ఒకరికి ఇచ్చే ప్రతిష్టాత్మకమైన " లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు 2026 " ను న్యాయమూర్తి జస్టిస్ టి .రజిని శాలువా, పూలమాల, జ్ఞాపిక , ప్రశంసా పత్రంతో ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా మీర్ అబ్రహం అలీ కామిల్, మహ్మద్ వశీయుద్దీన్, మడిగాల విజయభాస్కర్ రెడ్డి లకు సేవారత్న అవార్డు 2026 ను ముఖ్య అతిథి జస్టిస్ రజిని, ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి శాలువా పూలమాల జ్ఞాపిక ప్రశంసా పత్రంతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజనారాయణ ముదిరాజ్ సమాజ సేవలో నాలుగు శతాబ్దాలుగా నిర్విరామంగా నిరంతరం పాటుపడుతున్నందుకు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన జన్మ దినోత్సవాన్ని సందర్శించుకుని కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ప్రొ. బాల కిష్టా రెడ్డి అందరితో రాజ్యాంగ పరిరక్షణకు ప్రజల్లో అవగాహన కలిగిస్తానని ప్రతిజ్ఞ చేయించారు