ఎమ్మెల్యే జన్మదిన వేడుకలకు అనుమతి నిరాకరణపై ఆగ్రహం..
సూర్య ప్రతినిధి : ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలను నియోజకవర్గంలో నిర్వహించేందుకు పోలీసు అనుమతి నిరాకరించడంపై నెర్డం భాస్కర్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి తన జన్మదిన వేడుకలను ప్రజల మధ్య జరుపుకోవాలనుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే తన సేవా సంస్థ ద్వారా నియోజకవర్గ మహిళలకు కుట్టు మిషన్లు, వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించాలని సంకల్పించారని తెలిపారు. వేడుకలకు వచ్చే ప్రజల ఆశీర్వాదాలు తీసుకోవాలనే ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేస్తే అనుమతులు నిరాకరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. రాజకీయ కారణాలతో అడ్డంకులు సృష్టించడం సరికాదని పేర్కొన్నారు. ప్రజల ఆదరణ ఉన్న నాయకుడిని ఇలాంటి చర్యలతో ప్రజలకు దూరం చేయలేరన్నారు. ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను ప్రజలందరి భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహిస్తామని భాస్కర్‌గౌడ్ తెలిపారు.
ఎమ్మెల్యే జన్మదిన వేడుకలకు అడ్డంకులెందుకు?
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలను ఉప్పల్‌లో నిర్వహించకుండా అడ్డంకులు సృష్టించడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన మద్దతుదారులు విమర్శించారు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధి తన నియోజకవర్గంలో ప్రజల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడంలో తప్పేమిటని ప్రశ్నించారు. వేడుకలను అడ్డుకోవడం వెనుక రాజకీయ ఉద్దేశాలేమిటని నిలదీశారు.
ప్రజాసేవలో భాగంగా వికలాంగులకు సహాయం చేయడం, మహిళలకు శిక్షణ అందించడం, కుట్టు మిషన్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతున్న నాయకుడి వేడుకలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. రాజకీయ అడ్డంకులతో నాయకుడిని ప్రజలకు దూరం చేయలేరని, ప్రజల అభిమానం, ఆదరణే ఆయనకు అసలైన బలమని పేర్కొన్నారు. అడ్డంకులు తాత్కాలికమేనని, ప్రజల అభిమానం శాశ్వతమని స్పష్టం చేశారు.