telangana
భూముల రీ సర్వే, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్
సూర్య బోయినపల్లి.. మండలం మల్లాపూర్, వరదవెల్లి గ్రామాల్లో భూముల రీ సర్వే పనులు కొనసాగుతుండగా అదనపు కలెక్టర్ గడ్డం నరేష్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.భూముల రీ సర్వేపై ముందస్తుగా రైతులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రైతుల సమక్షంలోనే సర్వే చేసి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ శుక్రవారం తనిఖీ చేశారు.కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాలను ఆరా తీసి, కొనుగోలు కేంద్రంలో రైతుల సౌకర్యార్థం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.రైతులకు కొనుగోలు కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, నిబంధనలకు అనుగుణంగా తేమ శాతం వచ్చిన ధాన్యాన్నే కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు.కార్యక్రమాల్లో తహసీల్దార్ షరీఫోద్దీన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.