ముంబైలో జరుగుతున్న 3వ ప్రపంచ మేయర్ల సమావేశంలో ‘సర్క్యులర్ సిటీస్’ అనే అంశంపై కీలక ఉపన్యాసం చేసిన స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్.
ప్రపంచంలోని 30 దేశాల నుండి 200కు పైగా నగరాలకు చెందిన మేయర్లు, మున్సిపల్ కమిషనర్లు, విధాన రూపకర్తలతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాలలోని మేయర్లు, ఉన్నతాధికారులు ఈ సదస్సుకు హాజరు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో రాష్ట్రంలో చేపట్టిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాలు వివరించిన పట్టాభిరామ్. డంప్ యార్డ్ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకు సదస్సులో పలువురి ప్రశంసలు. దేశంలో మొట్టమొదటగా 'సర్క్యులర్ ఎకానమీ' పాలసీని రూపొందించి, రీసైక్లింగ్ కు ప్రాధాన్యత ఇస్తున్న తీరుపై సదస్సులో పట్టాభిరామ్ ప్రజెంటేషన్. రాష్ట్రంలో 107 వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాలు, 6 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ల గురించి సదస్సులో పట్టాభిరామ్ వివరణ.