BREAKING
కూటమి అభ్యర్థులను గెలిపించండి సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా నిఘా.. డీఎస్పీ దైవప్రసాద్. మంత్రి కిషన్ రెడ్డి  పాదయాత్రకు తరలి వెళ్లిన  బీజేపీ నాయకులు 27 న ముట్టడికి మద్దతు తెలిపిన మహాత్మా గాంధీ ఆటో డ్రైవర్స్ నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు.. తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు! అచ్చంపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన ఇలా ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా! ప్యాపిలి కూటమి సర్పంచ్ అభ్యర్థి తొప్పెల శ్రీనివాసులు దళితవాడ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం భూదాన భూములకు వారసులు భూమిలేని నిరుపేదలు మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా సిద్ధిపేటలో ఘనంగా ఆర్థిక అక్షరాస్యత – ఆర్థిక సమ్మిళిత అవగాహన శిబిరం.. ‘భోగి’ ప్రమోషన్లకు దూరంగా అనుపమ.. అసలు కారణమేంటి? విద్యార్థులకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తా రాచర్ల వైకాపా సర్పంచి అభ్యర్థి దివాకర్‌రెడ్డి పహిల్వాన్లకు కేసీఆర్ - కేసరి అవార్డులు ఉద్యోగులకు కావ్య, అనిరుధ్ స్పెషల్ లంచ్.. సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ! శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి కేశవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఉన్నట్టా.. లేనట్టా..?:కౌన్సిలర్ కొంపల్లి మాధవి భూమేష్ గౌడ్

ఆర్థిక సేవల్లో కృత్రిమ మేధతో వినూత్న ఆవిష్కరణలు

Select Suryaa Now
ఆర్థిక సేవల్లో కృత్రిమ మేధతో వినూత్న ఆవిష్కరణలు
జూబ్లీహిల్స్, మేజర్ న్యూస్: ఆర్థిక సేవల రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో టెక్ మహీంద్రా, మహీంద్రా విశ్వవిద్యాలయం సంయుక్తంగా ‘జీసీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కాంక్లేవ్–2026’ను నిర్వహించాయి. హైదరాబాద్‌లోని మహీంద్రా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ సదస్సులో ప్రిన్సిపల్, సిటిజన్స్ బ్యాంక్, డీబీఎస్ టెక్ ఇండియా, ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ జీసీసీ, అష్యూరెంట్ తదితర ప్రముఖ సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
టెక్ మహీంద్రా అమెరికాస్ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, ప్రభుత్వ రంగ విభాగాధిపతి రోషన్ శెట్టి మాట్లాడుతూ, ఆర్థిక సేవల సంస్థల ఆధునికీకరణ, నూతన ఉత్పత్తుల రూపకల్పన, కృత్రిమ మేధ వినియోగంలో జీసీసీలు కీలక పాత్ర పోషించగలవన్నారు. సాంకేతిక నైపుణ్యం, పరిశోధనలు, ప్రతిభావంతులైన మానవ వనరుల సమన్వయంతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు.
మహీంద్రా విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ యజులు మేడూరి మాట్లాడుతూ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, కీలక వ్యాపార నిర్ణయాలకు జీసీసీలు ప్రధాన కేంద్రాలుగా ఎదుగుతున్నాయన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిపుణులను తీర్చిదిద్దేందుకు పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సహకారం మరింత బలోపేతం కావాలని తెలిపారు.
సిటిజన్స్ బ్యాంక్ టెక్నాలజీ డైరెక్టర్ సుదీప్ ముఖోపాధ్యాయ్, ప్రిన్సిపల్ ఇంజినీరింగ్ డైరెక్టర్ అమల్‌కిరణ్ పాట్కర్ మాట్లాడుతూ, హైదరాబాద్ జీసీసీలకు ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్న నేపథ్యంలో ఇటువంటి సదస్సులు విజ్ఞాన మార్పిడి, నూతన ఆలోచనలు, వ్యాపార భాగస్వామ్యాలకు దోహదపడతాయని పేర్కొన్నారు. మహీంద్రా విశ్వవిద్యాలయంలోని క్వాంటం ప్రయోగశాల, కృత్రిమ మేధ, సూపర్ కంప్యూటింగ్ కేంద్రం, ఆర్థిక పరిశోధనా ప్రయోగశాల, నైపుణ్య శిక్షణ కేంద్రాలను ప్రతినిధులు సందర్శించారు.