విద్యార్థులకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తా రాచర్ల వైకాపా సర్పంచి అభ్యర్థి దివాకర్‌రెడ్డి
ప్యాపిలి, మేజర్ న్యూస్: గ్రామస్థులు ఆశీర్వదించి తనను సర్పంచిగా గెలిపిస్తే విద్యార్థుల సౌకర్యార్థం ఉచిత బస్సు ఏర్పాటు చేస్తానని రాచర్ల వైకాపా సర్పంచి అభ్యర్థి మూలింటి దివాకర్‌రెడ్డి హామీ ఇచ్చారు.రాచర్లకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు సమీపంలోని ప్రియా సిమెంట్ పరిశ్రమ వద్ద ఉన్న పాఠశాల/కళాశాలలో చదువుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. నిత్యం రాకపోకలకు వారు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గ్రామస్థుల సహకారంతో విద్యార్థుల విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని దివాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.