BREAKING
కూటమి అభ్యర్థులను గెలిపించండి సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా నిఘా.. డీఎస్పీ దైవప్రసాద్. మంత్రి కిషన్ రెడ్డి  పాదయాత్రకు తరలి వెళ్లిన  బీజేపీ నాయకులు 27 న ముట్టడికి మద్దతు తెలిపిన మహాత్మా గాంధీ ఆటో డ్రైవర్స్ నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు.. తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు! అచ్చంపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన ఇలా ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా! ప్యాపిలి కూటమి సర్పంచ్ అభ్యర్థి తొప్పెల శ్రీనివాసులు దళితవాడ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం భూదాన భూములకు వారసులు భూమిలేని నిరుపేదలు మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా సిద్ధిపేటలో ఘనంగా ఆర్థిక అక్షరాస్యత – ఆర్థిక సమ్మిళిత అవగాహన శిబిరం.. ‘భోగి’ ప్రమోషన్లకు దూరంగా అనుపమ.. అసలు కారణమేంటి? విద్యార్థులకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తా రాచర్ల వైకాపా సర్పంచి అభ్యర్థి దివాకర్‌రెడ్డి పహిల్వాన్లకు కేసీఆర్ - కేసరి అవార్డులు ఉద్యోగులకు కావ్య, అనిరుధ్ స్పెషల్ లంచ్.. సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ! శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి కేశవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఉన్నట్టా.. లేనట్టా..?:కౌన్సిలర్ కొంపల్లి మాధవి భూమేష్ గౌడ్

శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

Select Suryaa Now
శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

ఏలూరు, మేజర్ న్యూస్ :

శ్రీ అయ్యప్ప స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా వర్ధిల్లాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. ఏలూరు శాంతినగర్‌లోని శ్రీ లక్ష్మీ నరసింహా మోటార్స్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ప్రాంగణంలో మంగళవారం నారా కుటుంబం ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామివారికి విశేష రీతిలో పూజలు నిర్వహించారు. తడికమళ్ళ ప్రసాద్‌ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఏకాదశ రుద్రాభిషేకం, భజనా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటి,,, స్వామివారికి స్వయంగా అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్తలు నారా నరసింహారావు, నారా శేషు, నారా హనుమ కుమార్‌, చోడాబత్తుల సూరిబాబు, అంజనీ కుమార్‌లు శ్రీ అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిపూర్వకంగా నమస్కరించారు. పల్లకీ సేవ, పూలాభిషేకం, పంచామృతాభిషేకాలను అర్చకులు కందుకూరి వేంకట విజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. అయ్యప్ప భక్తి గీతాలకు పలువురు స్వాములు తన్మయత్వంతో నృత్యాలు చేశారు. అనంతరం భక్తిశ్రద్ధలతో భిక్షను స్వీకరించారు. దీంతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.