స్పందనలో వచ్చిన అర్జీల సమస్యలను పరిష్కరించండి. మనీషా నంద్యాల సబ్ కలెక్టర్
గడివేముల మేజర్ న్యూస్
మండల కేంద్రమైన గడివేముల లో బుధవారం తహసిల్దార్ కార్యాలయాన్ని నంద్యాల సబ్ కలెక్టర్ మనిషా ఆకస్మిక తనిఖీ చేశారు. తహసిల్దార్ వెంకటరమణ తో మండలంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రెవెన్యూ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా నంద సబ్ కలెక్టర్ మనీషా మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల స్పందనలో వచ్చిన అర్జీల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. తహసిల్దార్ కార్యాలయానికి వచ్చిన వారితో సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలన్నారు. రీ సర్వేను ఎటువంటి తప్పులు లేకుండా నిర్వహించాలన్నారు. రీ సర్వేలో రైతులకు ఏటువంటి సమస్య లేకుండా చేయాలన్నారు. గ్రామాల్లో వీఆర్వోలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వెంకటరమణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.