BREAKING
శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి కేశవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఉన్నట్టా.. లేనట్టా..?:కౌన్సిలర్ కొంపల్లి మాధవి భూమేష్ గౌడ్ నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తాడని ఊహించలేదు.. పాట్ కమిన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్‌పై ఉస్మాన్ ఖవాజా సంచలన వ్యాఖ్యలు! డబ్ల్యూబీబీఎల్ 2026లో అరుదైన ఘటన.. డీండ్రా డాటిన్ టైమ్డ్ అవుట్, సారా గ్లెన్‌కు ఫ్రీ బాల్! ఆర్థిక సేవల్లో కృత్రిమ మేధతో వినూత్న ఆవిష్కరణలు డీజే టిల్లు పాటకు మల్లారెడ్డి మాస్ స్టెప్పులు.. సోషల్ మీడియాలో సందడి విద్యార్థుల కోరిక మేరకు వేదికపై తీన్మార్ డ్యాన్స్.. కేరింతలతో మార్మోగిన సీఎంఆర్ స్కూల్ విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు రోబోటిక్స్ కార్యక్రమం వియాన్ ముల్డర్ ఆల్‌రౌండ్ షో.. బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 219 పరుగుల ఘన విజయం! మహిళలకు అండగా సఖి వన్‌స్టాప్ సెంటర్ : చైర్‌పర్సన్ శిరీష కృష్ణారెడ్డి అస్సాంలో ఎయిర్‌టెల్ మూడు డేటా సెంటర్లు - రూ. 1,200 కోట్లు పెట్టుబడి పెట్టనున్న సంస్థ డర్బన్ సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్‌గా కేన్ విలియమ్సన్.. ఎస్ఏ20 2027 సీజన్‌కు కొత్త సారథి! తిప్పయ్య దొడ్డిలో తాగునీరు బోరు ఏర్పాటు. స్పందనలో వచ్చిన అర్జీల సమస్యలను పరిష్కరించండి. మనీషా నంద్యాల సబ్ కలెక్టర్ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు 4.11 ఎకరాల్లో రెండు టవర్లు

వేడుకగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర రెడ్డి పుట్టినరోజు : శుభాకాంక్షలు తెలిపిన కూటమి నేతలు,కార్యకర్తలు

Select Suryaa Now
వేడుకగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర రెడ్డి పుట్టినరోజు : శుభాకాంక్షలు తెలిపిన కూటమి నేతలు,కార్యకర్తలు

మదనపల్లి టౌన్,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షులు పులి నరేంద్ర కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి.ఈ వేడుకలకు రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి,రాష్ట్ర ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ పఠాన్ ఖాదర్ ఖాన్ పాల్గొని ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఇందులో భాగంగా పులి నరేంద్ర రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి,శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా పఠాన్ ఖాదర్ ఖాన్ మాట్లాడుతూ బిజెపితోపాటు కూటమి పార్టీల నాయకులు,కార్యకర్తలతో సఖ్యంగా మెలుగుతూ అజాతశత్రువుగా గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు.జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి విశేష కృషి చేస్తున్నారని ప్రశంసించారు.కూటమి పార్టీల ఐక్యతకు కృషి చేస్తున్న పులి నరేంద్ర రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,ఆయురారోగ్యాలు,సుఖసంతోషాలతో ప్రజాసేవలో మరింత ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.కూటమి పార్టీల మధ్య స్నేహపూర్వక సంబంధాలు,నాయకుల మధ్య పరస్పర గౌరవం,ఐక్యత మరింత బలోపేతం కావాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు జబ్బల శ్రీనివాసులు,పఠాన్ మహబూబ్ ఖాన్,బిజెపి నవీన్,కొత్త వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి