BREAKING
ఫహాద్ ఫాజిల్, ప్రేమ్ కుమార్ క్రేజీ కాంబినేషన్.. ‘అసరీరి’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్! సుస్థిర అభివృద్ధికి భూవిజ్ఞాన శాస్త్రాలే కీలకం ఈఎస్సీఐలో మూడు రోజుల జాతీయ సదస్సు  ప్రారంభం మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.... బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని యువతి దుర్మరణం పౌల్ట్రీ రంగానికి సింగిల్ విండో విధానం రాజీవ్, సోనియా గాంధీ జ్ఞాపకాలను గుర్తుచేసిన రితేష్ జెనీలియా ఫోటో.. సోషల్ మీడియాలో రచ్చ! వేడుకగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర రెడ్డి పుట్టినరోజు : శుభాకాంక్షలు తెలిపిన కూటమి నేతలు,కార్యకర్తలు 200 కిలోమీటర్ల పాదయాత్ర.. శబరిమల చేరిన బౌరంపేట్ అయ్యప్ప భక్తుడు కూతురి పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు మ్యూచువల్ ఫండ్స్‌లోకి మళ్లించారంటూ ఆరోపణ.. వడ్డీ రాక.. అసలులో కోతలంటూ బాధితుడి ఆవేదన 29న ఎస్ఐఓ బహిరంగ సభ' ఎమ్మెల్యే సమక్షంలో టిడిపిలో చేరిన మైనార్టీ నాయకులు : తాజ్ బాషాను సాదరంగా ఆహ్వానించిన షాజహాన్ బాషా మాయన్ చాప్టర్ 1: కరుత్తచ్చన్ నేపథ్యంలో కొత్త ప్రపంచం.. జితిన్ కె జోస్ ఆసక్తికర విషయాలు! మౌలాలిలో...'లైఫ్ టోన్' మల్టీస్పెషాలిటీ, మల్టీ డిసిప్లినరీ క్లినిక్స్‌ ప్రారంభం హజరైన మల్కాజిగిరి ఎంపీ ఎమ్మెల్యే సామాజిక సమస్యలపై అవగాహన సీనియర్ జిల్లా త్రోబాల్ జట్టుకు ఎంపికైన విశ్వం విద్యార్థులు : అభినందించిన కళాశాల చైర్మన్ ఎం.ప్రభాకర్ రెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు పురిటి బిడ్డలు మృతి

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు పురిటి బిడ్డలు మృతి

Select Suryaa Now
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు పురిటి బిడ్డలు మృతి

 

వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ఎదుట బంధువులు నిరసన 

 

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: ఇద్దరు నవజాత శిశువులు మృతి చెందిన ఘటన బుధవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి విభాగంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు తవణంపల్లి మండలం పొన్నెడు పల్లి గ్రామానికి చెందిన పురుషోత్తం భార్య  రాధమ్మ ఈ నెల 16వ తేదీ తవణంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. పురటి బిడ్డకు ఆరోగ్యం బాగో లేదంటూ తవణంపల్లి వైద్యులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు రోజులపాటు చికిత్స అందించిన అనంతరం తిరుపతికి తీసుకెళ్లాలంటూ జిల్లా ఆసుపత్రి వైద్యులు చేయడంతో తిరుపతికి తీసుకెళ్లారు రెండు రోజులపాటు తిరుపతిలో చికిత్స అనంతరం పురిటి బిడ్డ మృతి చెందడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సక్రమంగా వైద్యం అందించకపోవడంతోనే మృతి చెందిందంటూ బుధవారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకొని మృతి చెందిన పురిటి బిడ్డతో తల్లిదండ్రులు రాధమ్మ, పురుషోత్తం తో పాటు బంధువులు ఆసుపత్రి నిర్వహకులను నిలదీస్తూ ఆసుపత్రి ముందు నిరసన వ్యక్తం చేశారు. కేవలం ట్రైన్ ఈ డాక్టర్లు, సిబ్బంది చికిత్స అందించారని నిపుణులైన డాక్టర్లు లేకపోవడంతోనే తమ బిడ్డ మృతి చెందిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. ఇదే క్రమంలో గుడిపాల మండలం 189 రామాపురం గ్రామానికి చెందిన సలోని, క్రిస్టిన్ దంపతుల మగ శిశువు బుధవారం ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి విభాగంలో మృతి చెందింది.. బుధవారం నాలుగు గంటల వరకు తమ మగ శిశువు ఆరోగ్యంగా ఉందని చెప్పిన అరగంటలోపే తమ మగ శిశు మృతి చెందడానికి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపిస్తున్నారు.

 

ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.