BREAKING
ఎంజీఆర్, శివాజీ గణేశన్‌లను మించిన నటులు లేరు.. దర్శకుడు ఆర్కే సెల్వమణి కీలక వ్యాఖ్యలు! ఫహాద్ ఫాజిల్, ప్రేమ్ కుమార్ క్రేజీ కాంబినేషన్.. ‘అసరీరి’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్! సుస్థిర అభివృద్ధికి భూవిజ్ఞాన శాస్త్రాలే కీలకం ఈఎస్సీఐలో మూడు రోజుల జాతీయ సదస్సు  ప్రారంభం మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.... బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని యువతి దుర్మరణం పౌల్ట్రీ రంగానికి సింగిల్ విండో విధానం రాజీవ్, సోనియా గాంధీ జ్ఞాపకాలను గుర్తుచేసిన రితేష్ జెనీలియా ఫోటో.. సోషల్ మీడియాలో రచ్చ! వేడుకగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర రెడ్డి పుట్టినరోజు : శుభాకాంక్షలు తెలిపిన కూటమి నేతలు,కార్యకర్తలు 200 కిలోమీటర్ల పాదయాత్ర.. శబరిమల చేరిన బౌరంపేట్ అయ్యప్ప భక్తుడు కూతురి పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు మ్యూచువల్ ఫండ్స్‌లోకి మళ్లించారంటూ ఆరోపణ.. వడ్డీ రాక.. అసలులో కోతలంటూ బాధితుడి ఆవేదన 29న ఎస్ఐఓ బహిరంగ సభ' ఎమ్మెల్యే సమక్షంలో టిడిపిలో చేరిన మైనార్టీ నాయకులు : తాజ్ బాషాను సాదరంగా ఆహ్వానించిన షాజహాన్ బాషా మాయన్ చాప్టర్ 1: కరుత్తచ్చన్ నేపథ్యంలో కొత్త ప్రపంచం.. జితిన్ కె జోస్ ఆసక్తికర విషయాలు! మౌలాలిలో...'లైఫ్ టోన్' మల్టీస్పెషాలిటీ, మల్టీ డిసిప్లినరీ క్లినిక్స్‌ ప్రారంభం హజరైన మల్కాజిగిరి ఎంపీ ఎమ్మెల్యే సామాజిక సమస్యలపై అవగాహన సీనియర్ జిల్లా త్రోబాల్ జట్టుకు ఎంపికైన విశ్వం విద్యార్థులు : అభినందించిన కళాశాల చైర్మన్ ఎం.ప్రభాకర్ రెడ్డి

సామాజిక సమస్యలపై అవగాహన

Select Suryaa Now
సామాజిక సమస్యలపై అవగాహన

నవాబుపేట సూర్య న్యూస్: జిల్లా ఎస్పీ జానకి ఆదేశాల మేరకు నవాబుపేట పోలీసుల ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ పోలీస్ శాఖకు చెందిన సురక్ష పోలీసు కళాబృందం బుధవారం మండలంలోని ఇప్పటూర్ గ్రామంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించింది.ఈ సందర్భంగా కళాబృందం సభ్యులు వివిధ కళారూపాల ద్వారా ప్రజలకు సామాజిక సమస్యలపై అవగాహన కల్పించారు.రోడ్డు ప్రమాదాల నివారణ,బాల్యవివాహాలు,మూఢనమ్మకాలు,హత్యలు,ఆత్మహత్యలు,అత్యాచారాలు,లైంగిక వేధింపులు,ప్రేమ పేరుతో మోసాలు,మానవ అక్రమ రవాణా,సైబర్ నేరాలు,మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.ఇలాంటి ఘటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కళాబృందం సభ్యులు పేర్కొన్నారు.కళారూపాల ద్వారా సామాజిక సమస్యలను వివరించడంతో గ్రామస్తులు ఆసక్తిగా కార్యక్రమాన్ని వీక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుబ్బ రవి కిరణ్,పోలీసు సిబ్బంది జయరాణి,జ్యోతి,రాములు,నర్సింహ చారి,వరప్రసాద్,బాలరాజు,గ్రామ పెద్దలు,యువత,మహిళలు,విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.