రాజీవ్, సోనియా గాంధీ జ్ఞాపకాలను గుర్తుచేసిన రితేష్ జెనీలియా ఫోటో.. సోషల్ మీడియాలో రచ్చ!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: సినీ జంట రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా పంచుకున్న తాజా ఫోటో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఒక రెస్టారెంట్‌లో జెనీలియా రితేష్ ఒడిలో కూర్చుని ఆయనకు తినిపిస్తున్నట్లుగా ఉన్న ఫోటోను రితేష్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ, టేబుల్ ఫర్ టూ, చైర్ ఫర్ వన్ అనే క్యాప్షన్ జోడించారు. ఈ ఫోటో వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఈ ఫోటో చూసిన పలువురు నెటిజన్లు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల ఆప్యాయతకు సంబంధించిన సందర్భాలను గుర్తుచేసుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల క్షణాలను ఈ జంట మరోసారి రీక్రియేట్ చేసిందంటూ కొందరు పేర్కొనగా, మరికొందరు రాజీవ్ సోనియా జెన్-జీ వెర్షన్ అంటూ సరదా వ్యాఖ్యలు చేశారు.
ఈ పోలికలకు ప్రధాన కారణం ఇటీవల జరిగిన ఓ పుస్తకావిష్కరణ వేదికపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలేనని నెటిజన్లు భావిస్తున్నారు. సోనియా గాంధీ రాసిన జ్ఞాపకాల పుస్తకం విడుదల కార్యక్రమంలో మాట్లాడిన రాహుల్ గాంధీ, తన తల్లిదండ్రుల మధ్య ఉన్న అన్యోన్యత గురించి పంచుకుంటూ, భోజన సమయంలో తన తల్లి సోనియా గాంధీ తన తండ్రి రాజీవ్ గాంధీ ఒడిలో కూర్చుని తినేవారని వివరించారు. చిన్నతనంలో అందరి ఇళ్లలోనూ ఇలాగే ఉంటుందేమోనని అనుకునేవాడినని, స్నేహితుల ఇళ్లకు వెళ్లిన తర్వాతే అది భిన్నమని అర్థమైందని ఆయన చెప్పిన మాటలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అప్పట్లో రాజకీయంగానూ, సామాజిక మాధ్యమాల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు కుటుంబ బంధాలను ప్రశంసించగా, మరికొందరు విమర్శలు చేశారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ శివపార్వతుల చిత్రాన్ని పంచుకుంటూ బదులిచ్చారు. తాజాగా రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియాల ఫోటోతో ఆ పాత చర్చ మరోసారి తెరపైకి వచ్చి నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
Also Read: మాయన్ చాప్టర్ 1: కరుత్తచ్చన్ నేపథ్యంలో కొత్త ప్రపంచం.. జితిన్ కె జోస్ ఆసక్తికర విషయాలు!