BREAKING
కూటమి అభ్యర్థులను గెలిపించండి సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా నిఘా.. డీఎస్పీ దైవప్రసాద్. మంత్రి కిషన్ రెడ్డి  పాదయాత్రకు తరలి వెళ్లిన  బీజేపీ నాయకులు 27 న ముట్టడికి మద్దతు తెలిపిన మహాత్మా గాంధీ ఆటో డ్రైవర్స్ నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు.. తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు! అచ్చంపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన ఇలా ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా! ప్యాపిలి కూటమి సర్పంచ్ అభ్యర్థి తొప్పెల శ్రీనివాసులు దళితవాడ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం భూదాన భూములకు వారసులు భూమిలేని నిరుపేదలు మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా సిద్ధిపేటలో ఘనంగా ఆర్థిక అక్షరాస్యత – ఆర్థిక సమ్మిళిత అవగాహన శిబిరం.. ‘భోగి’ ప్రమోషన్లకు దూరంగా అనుపమ.. అసలు కారణమేంటి? విద్యార్థులకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తా రాచర్ల వైకాపా సర్పంచి అభ్యర్థి దివాకర్‌రెడ్డి పహిల్వాన్లకు కేసీఆర్ - కేసరి అవార్డులు ఉద్యోగులకు కావ్య, అనిరుధ్ స్పెషల్ లంచ్.. సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ! శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి కేశవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఉన్నట్టా.. లేనట్టా..?:కౌన్సిలర్ కొంపల్లి మాధవి భూమేష్ గౌడ్

విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు రోబోటిక్స్ కార్యక్రమం

Select Suryaa Now
విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు రోబోటిక్స్ కార్యక్రమం

సంగారెడ్డి, మేజర్ న్యూస్ ప్రతినిధి:- విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచనా విధానం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు రోబోటిక్స్ వంటి వినూత్న కార్యక్రమాలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.సదాశివపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో సోహన్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోబోటిక్స్ కార్యక్రమాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పరిజ్ఞానంతో పాటు సాంకేతిక నైపుణ్యాలు కూడా ఎంతో అవసరమని అన్నారు. రోబోటిక్స్ వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తి పెంపొందుతాయని పేర్కొన్నారు.విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని సాంకేతిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు భవిష్యత్తులో సాంకేతిక రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్యను చేరువ చేసేందుకు సోహన్ అకాడమీ చేస్తున్న కృషిని కలెక్టర్ అభినందించారు.అనంతరం విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా, భోజనం నాణ్యత ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో సోహన్ అకాడమీ ప్రతినిధులు, మండల విద్యాధికారి,
తహసీల్దార్, కేజీబీవీ ప్రిన్సిపల్, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.