హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ : నగరంలోని పహిల్వాన్లకు ఈనెల 29న చేపట్టబోయే దీక్షా దివస్ సందర్భంగా కెసిఆర్ - కేసరి అవార్డులు, ప్రోత్సాహక నగదు అందజేస్తున్నామని బిఆర్ఎస్ హైదరాబాద్ పార్లమెంట్ కాంటెస్ట్ ఎంపీ, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బిఆర్ఎస్ నియోజకవర్గ నేతలతో కలిసి దీక్షా దివస్ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రాష్ట్రవ్యాప్త పిలుపుమేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే లు కాలేరు వెంకటేష్ , ముఠా గోపాల్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించే ఈ కార్యక్రమంలో కెసిఆర్ ఉద్యమ ప్రస్థానం గురించి వివరిస్తామన్నారు. పదవ తరగతి పిల్లలకు ప్రత్యేకంగా కేసిఆర్ పోరాట పట్టిమ, 14 సంవత్సరాల త్యాగాలను వీడియో ద్వారా చూపిస్తామన్నారు. ప్రోత్సాక నగదు రూ. 5 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నేతలు జగదీష్, రామరాజు, ధర్మేందర్, రఘు తదితరులు పాల్గొన్నారు.