ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా! ప్యాపిలి కూటమి సర్పంచ్ అభ్యర్థి తొప్పెల శ్రీనివాసులు దళితవాడ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం
ప్యాపిలి మేజర్ న్యూస్: పంచాయతీ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపిస్తే, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని ప్యాపిలి కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తొప్పెల శ్రీనివాసులు అన్నారు.
బుధవారం స్థానిక దళితవాడ నుంచి ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిసి తనకు మద్దతు తెలపాలని అభ్యర్థించారు. గ్రామ సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ ప్రచార కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తొప్పెల పెద్దిరాజు, మెడగట్టు చిన్నోడు, శేగు, మల్లికార్జున, బాలకృష్ణ, తొప్పెల నారాయణ, తొప్పెల నాగార్జున, పుల్లయ్య, పుట్ట నాగరాజు తదితరులు పాల్గొన్నారు.