BREAKING
కూటమి అభ్యర్థులను గెలిపించండి సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా నిఘా.. డీఎస్పీ దైవప్రసాద్. మంత్రి కిషన్ రెడ్డి  పాదయాత్రకు తరలి వెళ్లిన  బీజేపీ నాయకులు 27 న ముట్టడికి మద్దతు తెలిపిన మహాత్మా గాంధీ ఆటో డ్రైవర్స్ నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు.. తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు! అచ్చంపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన ఇలా ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా! ప్యాపిలి కూటమి సర్పంచ్ అభ్యర్థి తొప్పెల శ్రీనివాసులు దళితవాడ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం భూదాన భూములకు వారసులు భూమిలేని నిరుపేదలు మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా సిద్ధిపేటలో ఘనంగా ఆర్థిక అక్షరాస్యత – ఆర్థిక సమ్మిళిత అవగాహన శిబిరం.. ‘భోగి’ ప్రమోషన్లకు దూరంగా అనుపమ.. అసలు కారణమేంటి? విద్యార్థులకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తా రాచర్ల వైకాపా సర్పంచి అభ్యర్థి దివాకర్‌రెడ్డి పహిల్వాన్లకు కేసీఆర్ - కేసరి అవార్డులు ఉద్యోగులకు కావ్య, అనిరుధ్ స్పెషల్ లంచ్.. సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ! శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి కేశవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఉన్నట్టా.. లేనట్టా..?:కౌన్సిలర్ కొంపల్లి మాధవి భూమేష్ గౌడ్

మహిళలకు అండగా సఖి వన్‌స్టాప్ సెంటర్ : చైర్‌పర్సన్ శిరీష కృష్ణారెడ్డి

Select Suryaa Now
మహిళలకు అండగా సఖి వన్‌స్టాప్ సెంటర్ : చైర్‌పర్సన్ శిరీష కృష్ణారెడ్డి

శామీర్‌పేట, మేజర్ న్యూస్:మహిళలు, బాలికలపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని అలియాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం అలియాబాద్ మున్సిపల్ కార్యాలయంలో సఖి వన్‌స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు నిర్వహించే 16 రోజుల కార్యాచరణలో భాగంగా మహిళలపై హింస నిర్మూలన, బాధితులకు న్యాయం, నేరస్థులకు శిక్ష వంటి అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ..…మహిళలపై హింస మానవ హక్కుల ఉల్లంఘనలో తీవ్రమైన సమస్యగా ఉందని, లింగ వివక్షను రూపుమాపి మహిళలకు సమాన హక్కులు కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళలు తమ హక్కులు, చట్టపరమైన రక్షణలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.బాధిత మహిళలకు సఖి వన్‌స్టాప్ సెంటర్ ద్వారా వైద్య సహాయం, కౌన్సెలింగ్, పోలీస్, న్యాయ సహాయం, తాత్కాలిక వసతి వంటి సమీకృత సేవలు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయని వివరించారు. అత్యవసర సహాయం కోసం మహిళా హెల్ప్‌లైన్ 181, బాలల సహాయ కేంద్రం 1098 నంబర్లను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో 20వ వార్డు కౌన్సిలర్ కోడూరి మౌనిక దినేష్, వైద్య అధికారులు డాక్టర్ సంగీత, డాక్టర్ ఎలీనా, సఖి కేంద్రం ఇన్‌చార్జి తిరుమల దేవి, నిర్వాహకులు సలోమి, రేణుక, అలియాబాద్ సూపర్‌వైజర్లు నాగమణి, మమత, సఖి కేస్ వర్కర్ శిరీష, పలువురు మహిళలు పాల్గొన్నారు.