BREAKING
2027 పర్యాటక గమ్యస్థానంగా భారత్‌కు అంతర్జాతీయ గుర్తింపు కూటమి అభ్యర్థులను గెలిపించండి సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా నిఘా.. డీఎస్పీ దైవప్రసాద్. మంత్రి కిషన్ రెడ్డి  పాదయాత్రకు తరలి వెళ్లిన  బీజేపీ నాయకులు 27 న ముట్టడికి మద్దతు తెలిపిన మహాత్మా గాంధీ ఆటో డ్రైవర్స్ నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు.. తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు! అచ్చంపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన ఇలా ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా! ప్యాపిలి కూటమి సర్పంచ్ అభ్యర్థి తొప్పెల శ్రీనివాసులు దళితవాడ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం భూదాన భూములకు వారసులు భూమిలేని నిరుపేదలు మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా సిద్ధిపేటలో ఘనంగా ఆర్థిక అక్షరాస్యత – ఆర్థిక సమ్మిళిత అవగాహన శిబిరం.. ‘భోగి’ ప్రమోషన్లకు దూరంగా అనుపమ.. అసలు కారణమేంటి? విద్యార్థులకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తా రాచర్ల వైకాపా సర్పంచి అభ్యర్థి దివాకర్‌రెడ్డి పహిల్వాన్లకు కేసీఆర్ - కేసరి అవార్డులు ఉద్యోగులకు కావ్య, అనిరుధ్ స్పెషల్ లంచ్.. సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ! శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు

Select Suryaa Now
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు

అనకాపల్లి ప్రతినిధి, మేజర్ న్యూస్:
రెండవ సాధారణ గ్రామ పంచాయితీ ఎన్నికలు రేపు జరగబోవు మొదటి  విడత ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా  నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్  అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం  జిల్లా కలెక్టర్ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆర్డీవోలు, ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధులకు నియమించబడిన సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి ఏర్పాట్లను పరిశీలించాలని తెలిపారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, పోలింగ్ సిబ్బంది రవాణా, పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని  స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్,  జిల్లా పంచాయతీ అధికారి కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

రిపోర్టర్, రవికుమార్, జిల్లా ప్రతినిధి: