BREAKING
డబ్ల్యూబీబీఎల్ 2026లో అరుదైన ఘటన.. డీండ్రా డాటిన్ టైమ్డ్ అవుట్, సారా గ్లెన్‌కు ఫ్రీ బాల్! ఆర్థిక సేవల్లో కృత్రిమ మేధతో వినూత్న ఆవిష్కరణలు డీజే టిల్లు పాటకు మల్లారెడ్డి మాస్ స్టెప్పులు.. సోషల్ మీడియాలో సందడి విద్యార్థుల కోరిక మేరకు వేదికపై తీన్మార్ డ్యాన్స్.. కేరింతలతో మార్మోగిన సీఎంఆర్ స్కూల్ విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు రోబోటిక్స్ కార్యక్రమం వియాన్ ముల్డర్ ఆల్‌రౌండ్ షో.. బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 219 పరుగుల ఘన విజయం! మహిళలకు అండగా సఖి వన్‌స్టాప్ సెంటర్ : చైర్‌పర్సన్ శిరీష కృష్ణారెడ్డి అస్సాంలో ఎయిర్‌టెల్ మూడు డేటా సెంటర్లు - రూ. 1,200 కోట్లు పెట్టుబడి పెట్టనున్న సంస్థ డర్బన్ సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్‌గా కేన్ విలియమ్సన్.. ఎస్ఏ20 2027 సీజన్‌కు కొత్త సారథి! తిప్పయ్య దొడ్డిలో తాగునీరు బోరు ఏర్పాటు. స్పందనలో వచ్చిన అర్జీల సమస్యలను పరిష్కరించండి. మనీషా నంద్యాల సబ్ కలెక్టర్ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు 4.11 ఎకరాల్లో రెండు టవర్లు ఎంజీఆర్, శివాజీ గణేశన్‌లను మించిన నటులు లేరు.. దర్శకుడు ఆర్కే సెల్వమణి కీలక వ్యాఖ్యలు! ఫహాద్ ఫాజిల్, ప్రేమ్ కుమార్ క్రేజీ కాంబినేషన్.. ‘అసరీరి’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్! సుస్థిర అభివృద్ధికి భూవిజ్ఞాన శాస్త్రాలే కీలకం ఈఎస్సీఐలో మూడు రోజుల జాతీయ సదస్సు  ప్రారంభం

29న ఎస్ఐఓ బహిరంగ సభ'

Select Suryaa Now
29న ఎస్ఐఓ బహిరంగ సభ'
 .హిమాయత్ నగర్ , మేజర్ న్యూస్ :  యువతలో చైతన్యం నింపడానికి, సమాజ పునర్నిర్మాణమే లక్ష్యంగా స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఓ) హైదరాబాద్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 29న ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో "మీరే ఈ ప్రపంచ నిర్మాతలు" అనే నినాదంతో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఎస్ఐఓ ప్రతినిధులు అజామ్, ఉమేద్, ఉజాఫా, ఫసీ, ఇమాద్, అజీజ్ లు తెలిపారు.ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బహిరంగ సభ పోస్టర్ ను ఆవిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ ఈ సభకు ముఖ్య వక్తలుగా జమాతే ఇస్లామీ హింద్ (జేఐహెచ్) జాతీయ అధ్యక్షులు సయ్యద్ సదాతుల్లా హుస్సేని, జమాతే ఇస్లామి హింద్ జాతీయ ఉపాధ్యక్షులు మాలిక్ మోతాసిమ్ ఖాన్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ అజారుద్దీన్, ఎస్ఐఓ జాతీయ అధ్యక్షులు అబ్దుల్ హఫీజ్, రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ ఫరాజ్ అహ్మద్, హైదరాబాద్ నగర అధ్యక్షులు డాక్టర్ ముబాషిర్ అహ్మద్ హాజరై ప్రసంగించనున్నారని, ఈ బహిరంగ సభకు హాజరయ్యే మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.నగరంలోని యువత, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.