BREAKING
శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి కేశవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఉన్నట్టా.. లేనట్టా..?:కౌన్సిలర్ కొంపల్లి మాధవి భూమేష్ గౌడ్ నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తాడని ఊహించలేదు.. పాట్ కమిన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్‌పై ఉస్మాన్ ఖవాజా సంచలన వ్యాఖ్యలు! డబ్ల్యూబీబీఎల్ 2026లో అరుదైన ఘటన.. డీండ్రా డాటిన్ టైమ్డ్ అవుట్, సారా గ్లెన్‌కు ఫ్రీ బాల్! ఆర్థిక సేవల్లో కృత్రిమ మేధతో వినూత్న ఆవిష్కరణలు డీజే టిల్లు పాటకు మల్లారెడ్డి మాస్ స్టెప్పులు.. సోషల్ మీడియాలో సందడి విద్యార్థుల కోరిక మేరకు వేదికపై తీన్మార్ డ్యాన్స్.. కేరింతలతో మార్మోగిన సీఎంఆర్ స్కూల్ విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు రోబోటిక్స్ కార్యక్రమం వియాన్ ముల్డర్ ఆల్‌రౌండ్ షో.. బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 219 పరుగుల ఘన విజయం! మహిళలకు అండగా సఖి వన్‌స్టాప్ సెంటర్ : చైర్‌పర్సన్ శిరీష కృష్ణారెడ్డి అస్సాంలో ఎయిర్‌టెల్ మూడు డేటా సెంటర్లు - రూ. 1,200 కోట్లు పెట్టుబడి పెట్టనున్న సంస్థ డర్బన్ సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్‌గా కేన్ విలియమ్సన్.. ఎస్ఏ20 2027 సీజన్‌కు కొత్త సారథి! తిప్పయ్య దొడ్డిలో తాగునీరు బోరు ఏర్పాటు. స్పందనలో వచ్చిన అర్జీల సమస్యలను పరిష్కరించండి. మనీషా నంద్యాల సబ్ కలెక్టర్ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు 4.11 ఎకరాల్లో రెండు టవర్లు

సుస్థిర అభివృద్ధికి భూవిజ్ఞాన శాస్త్రాలే కీలకం ఈఎస్సీఐలో మూడు రోజుల జాతీయ సదస్సు  ప్రారంభం

Select Suryaa Now
సుస్థిర అభివృద్ధికి భూవిజ్ఞాన శాస్త్రాలే కీలకం ఈఎస్సీఐలో మూడు రోజుల జాతీయ సదస్సు  ప్రారంభం

హైదరాబాద్ మేజర్ న్యూస్ (సిటీ ప్రతినిధి):సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, మైనింగ్ రంగంలో సాంకేతిక పురోగతే లక్ష్యంగా ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా  ఆధ్వర్యంలో మూడు రోజుల జాతీయ సదస్సు బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈఎస్సీఐ మైనింగ్ విభాగం నిర్వహిస్తున్న ఈ సదస్సు నవంబర్ 25 నుంచి 27 వరకు ఈఎస్సీఐ లోని చాణక్య సెమినార్ హాల్‌లో కొనసాగనుంది. “సుస్థిర అభివృద్ధి కోసం భూవిజ్ఞాన శాస్త్రాలు ప్రధాన ఇతివృత్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా మైనింగ్, భూగర్భ శాస్త్రాలు, పర్యావరణ పరిరక్షణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కీలక ఖనిజాల అన్వేషణ, గనుల భద్రత, ఉత్పాదకత వంటి అంశాలపై దేశవ్యాప్తంగా నిపుణులు, పరిశోధకులు, ఇంజినీర్లు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, జిందాల్ పవర్ లిమిటెడ్, తల తెలంగాణ జెన్కో , నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్,  ఎన్ఎండిసి లిమిటెడ్, వెన్సార్ కన్‌స్ట్రక్షన్ కంపెనీతో పాటు పలు ప్రముఖ సంస్థలు ఈ సదస్సుకు స్పాన్సర్‌షిప్‌లు, ప్రతినిధుల నామినేషన్ల రూపంలో సహకారం అందించాయి.
మైనింగ్ రంగంలో సవాళ్లు.. సాంకేతిక పరిష్కారాలపై దృష్టి
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభా, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నెట్‌జీరో లక్ష్యాల సాధనకు స్వచ్ఛమైన ఇంధన వనరుల అవసరం పెరుగుతున్న నేపథ్యంలో మైనింగ్ రంగం కీలక మార్పులకు లోనవుతోందని సదస్సులో చర్చించనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అవసరమైన కీలక ఖనిజాల సరఫరాను నిరంతరాయంగా కొనసాగించడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు అత్యంత ప్రాధాన్యతగా మారిందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గనుల తవ్వకాల్లో భద్రత, పర్యావరణ సమతుల్యత, ఉత్పాదకత పెంపు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.
ఈ సదస్సుకు సాంకేతిక పరిశోధనా పత్రాల సమర్పణకు విశేష స్పందన లభించగా, ఎంపికైన పరిశోధనా పత్రాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు, కేస్ స్టడీలు, ఆహ్వానిత పరిశోధనా పత్రాల రూపంలో నిపుణులు సమర్పించనున్నారు. మైనింగ్ ఇంజినీర్లు, భూగర్భ శాస్త్రవేత్తలు, పర్యావరణ ఇంజినీర్లు, పీజీ, అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు ప్రతినిధులుగా పాల్గొంటున్నారు.
ప్రముఖుల హాజరు.. ముగింపులో సిఫార్సులతో నివేదిక
సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వెన్సార్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డా. ఎం.ఎస్. వెంకట రామయ్య, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా. హరి సర్వోత్తమ, ఈ ఎస్ సి ఐ  గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ డా. ఆర్. భీమారావు, ఈ ఎస్సీఐ డైరెక్టర్, జాతీయ సదస్సు ఛైర్మన్ కల్నల్ హర్పాల్ సింగ్ గ్రేవాల్, సదస్సు కన్వీనర్ ఇంజి. కె.జె. అమర్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.

మూడు రోజుల పాటు నిర్వహించే సాంకేతిక సమావేశాల్లో వెలువడే అభిప్రాయాలు, కీలక అంశాలు, సిఫార్సులను సమగ్రంగా క్రోడీకరించి ముగింపులో ప్రత్యేక నివేదిక రూపొందించనున్నారు. ఈ నివేదికను సంబంధిత భాగస్వామ్య సంస్థలకు పంపిణీ చేయనున్నారు. ఈ ఎస్సి ఐ లోని వివిధ విభాగాల అధిపతులు, సిబ్బంది సదస్సు విజయవంతానికి చురుకుగా సహకరిస్తున్నారు.