BREAKING
డబ్ల్యూబీబీఎల్ 2026లో అరుదైన ఘటన.. డీండ్రా డాటిన్ టైమ్డ్ అవుట్, సారా గ్లెన్‌కు ఫ్రీ బాల్! ఆర్థిక సేవల్లో కృత్రిమ మేధతో వినూత్న ఆవిష్కరణలు డీజే టిల్లు పాటకు మల్లారెడ్డి మాస్ స్టెప్పులు.. సోషల్ మీడియాలో సందడి విద్యార్థుల కోరిక మేరకు వేదికపై తీన్మార్ డ్యాన్స్.. కేరింతలతో మార్మోగిన సీఎంఆర్ స్కూల్ విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు రోబోటిక్స్ కార్యక్రమం వియాన్ ముల్డర్ ఆల్‌రౌండ్ షో.. బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 219 పరుగుల ఘన విజయం! మహిళలకు అండగా సఖి వన్‌స్టాప్ సెంటర్ : చైర్‌పర్సన్ శిరీష కృష్ణారెడ్డి అస్సాంలో ఎయిర్‌టెల్ మూడు డేటా సెంటర్లు - రూ. 1,200 కోట్లు పెట్టుబడి పెట్టనున్న సంస్థ డర్బన్ సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్‌గా కేన్ విలియమ్సన్.. ఎస్ఏ20 2027 సీజన్‌కు కొత్త సారథి! తిప్పయ్య దొడ్డిలో తాగునీరు బోరు ఏర్పాటు. స్పందనలో వచ్చిన అర్జీల సమస్యలను పరిష్కరించండి. మనీషా నంద్యాల సబ్ కలెక్టర్ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు 4.11 ఎకరాల్లో రెండు టవర్లు ఎంజీఆర్, శివాజీ గణేశన్‌లను మించిన నటులు లేరు.. దర్శకుడు ఆర్కే సెల్వమణి కీలక వ్యాఖ్యలు! ఫహాద్ ఫాజిల్, ప్రేమ్ కుమార్ క్రేజీ కాంబినేషన్.. ‘అసరీరి’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్! సుస్థిర అభివృద్ధికి భూవిజ్ఞాన శాస్త్రాలే కీలకం ఈఎస్సీఐలో మూడు రోజుల జాతీయ సదస్సు  ప్రారంభం

పౌల్ట్రీ రంగానికి సింగిల్ విండో విధానం

Select Suryaa Now
పౌల్ట్రీ రంగానికి సింగిల్ విండో విధానం
శేరిలింగంపల్లి,మేజర్ న్యూస్ :  తెలంగాణలో పౌల్ట్రీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అనుమతుల మంజూరులో జాప్యం లేకుండా త్వరలోనే సమగ్ర పాలసీతో సింగిల్ విండో విధానాన్ని అమల్లోకి తెస్తామని ప్రకటించారు.బుధవారం హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఐపీఈఎంఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 18వ ‘పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో-2026’ను సీఎం ప్రారంభించారు. మంత్రి వాకిటి శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, ఐపీఈ ఎంఏ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్, ఎమ్మెల్యే గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పౌల్ట్రీ ఫారాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, ల్యాండ్ కన్వర్షన్ ప్రక్రియను సులభతరం చేస్తామని తెలిపారు. పట్టణాల్లో అమలవుతున్న బిల్డ్‌నౌ సింగిల్ విండో విధానాన్ని గ్రామాలకు కూడా విస్తరిస్తామన్నారు.పౌల్ట్రీ పరిశ్రమకు కీలకమైన మొక్కజొన్న, సోయాబీన్ దాణా సరఫరాలో సంక్షోభం తలెత్తితే ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. అందుబాటులో ఉన్న బఫర్ స్టాక్‌ను పరిశీలించి పరిశ్రమకు ఏ ధరకు, ఏ విధంగా సరఫరా చేయవచ్చో వ్యవసాయ శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో సమీక్షించి 48 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని సూచించారు.పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి ప్రతిపాదనలు సమర్పిస్తే భారత్ ఫ్యూచర్ సిటీ లో ప్రత్యేక కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు భూమి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రతినిధులు ప్రతిపాదనలతో రావాలని సూచించారు.తెలంగాణలో ప్రతిరోజూ 5.30 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయని, రైతులకు ఆదాయం కల్పించడంతో పాటు యువతకు ప్రొటీన్లు అందించడంలో పౌల్ట్రీ రంగం కీలక పాత్ర పోషిస్తోందని సీఎం పేర్కొన్నారు. ఐటీ, ఫార్మా, డిఫెన్స్ రంగాలతో పాటు పౌల్ట్రీని కూడా ప్రాధాన్యత రంగంగా గుర్తించి పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపారు.తెలంగాణ జీడీపీలో ప్రస్తుతం 5 శాతం వాటా ఉందని, దానిని 10 శాతానికి పెంచడమే లక్ష్యమని చెప్పారు. 2034 నాటికి ఒక ట్రిలియన్, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. పెట్టుబడిదారులకు పూర్తి భరోసా కల్పిస్తూ పౌల్ట్రీ పరిశ్రమకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.