మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.... బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని యువతి దుర్మరణం
మాదాపూర్,మేజర్ న్యూస్ : మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుష్మా చౌదరి (28) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి మాదాపూర్‌లోని స్నేహితుడి ఇంట్లో భోజనం చేసిన అక్షయ్‌కుమార్ (28), సుష్మా బుధవారం తెల్లవారుజామున బుల్లెట్‌పై కొండాపూర్‌కు బయలుదేరారు. చిన్న పెద్దమ్మ టెంపుల్ సమీపంలోని సీఐఐ జంక్షన్ వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్‌ను, అనంతరం చెట్టును ఢీకొట్టింది. దీంతో వెనుక కూర్చున్న సుష్మాకు తలకు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే మెడికవర్ ఆసుపత్రికి తరలించగా, తెల్లవారుజామున 1.25 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.