దుండిగల్ మేజర్ న్యూస్ బౌరంపేట్‌కు చెందిన గోనే రాంరెడ్డి గురుస్వామి అయ్యప్ప స్వామి దర్శనం కోసం చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. గత నెల 22న బౌరంపేట్ నుంచి శబరిమలకు కాలినడకన బయలుదేరిన ఆయన 31 రోజుల పాటు సుమారు 1200కు పైగా కిలోమీటర్లు ప్రయాణించి శబరిమల చేరుకున్నారు. అయ్యప్ప స్వామిని దర్శించుకుని తిరిగి బుధవారం బౌరంపేట్ చేరుకున్న గోనే రాంరెడ్డి గురుస్వామికి అయ్యప్ప భక్తులు, మాలధారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బౌరంపేట్ బీజేపీ అధ్యక్షులు గంట స్వామి పీసరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భక్తులు ఆయనను సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షులు వై. సీతారాం రెడ్డి, అర్చకులు సందీప్ స్వామి, అంజిరెడ్డి గురుస్వామితో పాటు దీక్షాస్వాములు గూడెపు రాజిరెడ్డి, ఆకుల వెంకటేష్, రమేష్, బిక్షపతి, వై. జంగారెడ్డి, పద్మారావు, విశ్వేశ్వర్, లక్ష్మణ్, దిలీప్ రెడ్డి, జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో మాలధారులు పాల్గొని గోనే రాంరెడ్డి గురుస్వామికి స్వాగతం పలికారు.