BREAKING
శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి కేశవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఉన్నట్టా.. లేనట్టా..?:కౌన్సిలర్ కొంపల్లి మాధవి భూమేష్ గౌడ్ నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తాడని ఊహించలేదు.. పాట్ కమిన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్‌పై ఉస్మాన్ ఖవాజా సంచలన వ్యాఖ్యలు! డబ్ల్యూబీబీఎల్ 2026లో అరుదైన ఘటన.. డీండ్రా డాటిన్ టైమ్డ్ అవుట్, సారా గ్లెన్‌కు ఫ్రీ బాల్! ఆర్థిక సేవల్లో కృత్రిమ మేధతో వినూత్న ఆవిష్కరణలు డీజే టిల్లు పాటకు మల్లారెడ్డి మాస్ స్టెప్పులు.. సోషల్ మీడియాలో సందడి విద్యార్థుల కోరిక మేరకు వేదికపై తీన్మార్ డ్యాన్స్.. కేరింతలతో మార్మోగిన సీఎంఆర్ స్కూల్ విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు రోబోటిక్స్ కార్యక్రమం వియాన్ ముల్డర్ ఆల్‌రౌండ్ షో.. బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 219 పరుగుల ఘన విజయం! మహిళలకు అండగా సఖి వన్‌స్టాప్ సెంటర్ : చైర్‌పర్సన్ శిరీష కృష్ణారెడ్డి అస్సాంలో ఎయిర్‌టెల్ మూడు డేటా సెంటర్లు - రూ. 1,200 కోట్లు పెట్టుబడి పెట్టనున్న సంస్థ డర్బన్ సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్‌గా కేన్ విలియమ్సన్.. ఎస్ఏ20 2027 సీజన్‌కు కొత్త సారథి! తిప్పయ్య దొడ్డిలో తాగునీరు బోరు ఏర్పాటు. స్పందనలో వచ్చిన అర్జీల సమస్యలను పరిష్కరించండి. మనీషా నంద్యాల సబ్ కలెక్టర్ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు 4.11 ఎకరాల్లో రెండు టవర్లు

ఎమ్మెల్యే సమక్షంలో టిడిపిలో చేరిన మైనార్టీ నాయకులు : తాజ్ బాషాను సాదరంగా ఆహ్వానించిన షాజహాన్ బాషా

Select Suryaa Now
ఎమ్మెల్యే సమక్షంలో టిడిపిలో చేరిన మైనార్టీ నాయకులు : తాజ్ బాషాను సాదరంగా ఆహ్వానించిన షాజహాన్ బాషా

మదనపల్లి,మేజర్ న్యూస్ : పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా సమక్షంలో కొత్తఇండ్లు గ్రామపంచాయతీకి చెందిన పలువురు మైనార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు.కొత్తఇండ్లు గ్రామానికి చెందిన వైసీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు సయ్యద్ తాజ్ బాషా (క్వాలిటీ నట్స్)తోపాటు షంషీర్,బి.ఎం.సిద్ధిక్,ఉమర్,హతిక్ బాషా,ఆన్సర్ బాషా,బాబ్జి,కాజీ ఉమర్ మొహమ్మద్,సలీం,సాదిక్,షేక్ షబానా,శేఖర్,రహజాన్ తదితరులు గ్రామ కూటమి అభ్యర్థి దొరస్వామి నాయుడు,ఖాదర్ షరీఫ్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరగా,ఎమ్మెల్యే పార్టీ కండువాలతో సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం,అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పలువురు మైనార్టీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని తెలిపారు.పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు,గౌరవం కల్పిస్తూ వారి అభివృద్ధికి,ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.అనంతరం తాజ్ బాషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన దక్షత,తెలుగుదేశం పార్టీ విధానాలు నన్ను ఎంతగానో ఆకర్షించాయన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలో ఏపీ,ఎమ్మెల్యే షాజహాన్ బాషా సారధ్యంలో మదనపల్లి నియోజకవర్గం గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్నాయని కొనియాడారు.పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తామని,టిడిపి బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి