BREAKING
స్పందనలో వచ్చిన అర్జీల సమస్యలను పరిష్కరించండి. మనీషా నంద్యాల సబ్ కలెక్టర్ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు 4.11 ఎకరాల్లో రెండు టవర్లు ఎంజీఆర్, శివాజీ గణేశన్‌లను మించిన నటులు లేరు.. దర్శకుడు ఆర్కే సెల్వమణి కీలక వ్యాఖ్యలు! ఫహాద్ ఫాజిల్, ప్రేమ్ కుమార్ క్రేజీ కాంబినేషన్.. ‘అసరీరి’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్! సుస్థిర అభివృద్ధికి భూవిజ్ఞాన శాస్త్రాలే కీలకం ఈఎస్సీఐలో మూడు రోజుల జాతీయ సదస్సు  ప్రారంభం మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.... బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని యువతి దుర్మరణం పౌల్ట్రీ రంగానికి సింగిల్ విండో విధానం రాజీవ్, సోనియా గాంధీ జ్ఞాపకాలను గుర్తుచేసిన రితేష్ జెనీలియా ఫోటో.. సోషల్ మీడియాలో రచ్చ! వేడుకగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర రెడ్డి పుట్టినరోజు : శుభాకాంక్షలు తెలిపిన కూటమి నేతలు,కార్యకర్తలు 200 కిలోమీటర్ల పాదయాత్ర.. శబరిమల చేరిన బౌరంపేట్ అయ్యప్ప భక్తుడు కూతురి పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు మ్యూచువల్ ఫండ్స్‌లోకి మళ్లించారంటూ ఆరోపణ.. వడ్డీ రాక.. అసలులో కోతలంటూ బాధితుడి ఆవేదన 29న ఎస్ఐఓ బహిరంగ సభ' ఎమ్మెల్యే సమక్షంలో టిడిపిలో చేరిన మైనార్టీ నాయకులు : తాజ్ బాషాను సాదరంగా ఆహ్వానించిన షాజహాన్ బాషా మాయన్ చాప్టర్ 1: కరుత్తచ్చన్ నేపథ్యంలో కొత్త ప్రపంచం.. జితిన్ కె జోస్ ఆసక్తికర విషయాలు!

సీనియర్ జిల్లా త్రోబాల్ జట్టుకు ఎంపికైన విశ్వం విద్యార్థులు : అభినందించిన కళాశాల చైర్మన్ ఎం.ప్రభాకర్ రెడ్డి

Select Suryaa Now
సీనియర్ జిల్లా త్రోబాల్ జట్టుకు ఎంపికైన విశ్వం విద్యార్థులు : అభినందించిన కళాశాల చైర్మన్ ఎం.ప్రభాకర్ రెడ్డి

మదనపల్లె రూరల్,మేజర్ న్యూస్ : విశ్వం ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు సీనియర్ జిల్లా త్రోబాల్ జట్టుకు ఎంపికయ్యారు.జిల్లా త్రోబాల్ ఎంపిక పోటీలు ఈనెల 22వ తేదీ (ఆదివారం) రామసముద్రంలోని ఏపీ ఆదర్శ పాఠశాలలో జరిగాయి.వివిధ కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా ఈ ఎంపిక పోటీల్లో పాల్గొన్నారు.విశ్వంలో సీఎస్ఈ నాలుగో సంవత్సరం చదువుతున్న బి.స్నేహలత,ఏఐఎంఎల్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎ.మహాలక్ష్మి,సివిల్ ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న జి.గణపతి,ఎ.నందివర్ధన్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.ఈ విద్యార్థులు నవంబర్ 28,29 తేదీల్లో విజయవాడలో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు.ఈ విద్యార్థులకు విశ్వం ఇంజినీరింగ్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్లు ఎం.మహేంద్ర రెడ్డి,ఆర్.రాజ్ కుమార్,ఎ.సురేష్ శిక్షణ ఇచ్చారు.కళాశాల చైర్మన్ ఎం.ప్రభాకర్ రెడ్డి,డైరెక్టర్ నందిత రెడ్డి,ప్రిన్సిపాల్ డాక్టర్ బి.డి.వెంకటరమణ రెడ్డి,వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సుబ్బారెడ్డి,ఫిజికల్ డైరెక్టర్లు,అధ్యాపకులు,విద్యార్థులు ఎంపికైన విద్యార్థులను అభినందించి,రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి