-- *జాతీయస్థాయి అండర్ 14 స్కూల్ గేమ్స్ కరాటే పోటీలకు టి .లక్షిత్ కిషోర్ ఎంపిక* -- *కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ సుధాకర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన స్కూల్ గేమ్స్ కార్యదర్శులు లక్ష్మయ్య, అరుణకుమారి*
-- *జాతీయస్థాయి అండర్ 14 స్కూల్ గేమ్స్ కరాటే పోటీలకు టి .లక్షి
కర్నూలు మన న్యూస్ క్రీడలు నవంబర్ 25: ఈ నెల 21 నుంచి 22 తేదీ వరకు పాలకొండ పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన అండర్ - 14 బాలుర కరాటే పోటీలలో సంకల్ బాగ్ లోని శ్రీ చైతన్య కె 7 పాఠశాలకు చెందిన విద్యార్థి టీ లక్షిత్ కిషోర్ మంచి ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయిలో గోల్డ్ మెడల్ ని సాధించి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు కోచ్ ఆరిఫ్ మాస్టర్ తెలిపారు. బుధవారం స్థానిక కర్నూల్ జిల్లా విద్యాశాఖ కార్యాలయం నందు డి ఈ ఓ ఎల్ సుధాకర్ ను మర్యాద పూర్వకముగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా డిఇఓ, టి లక్షిత్ కిషోర్ కు ఫ్లవర్ బోకెను అందజేసి అభినందన తెలియజేశారు. ఈ సందర్భంగా డి ఈ ఓ మాట్లాడుతూ జాతీయ స్థాయికి ఎంపికైన టి లక్షిత్ కిషోర్ పంజాబ్ లోని, లుధియానా లో జరగబోవు 70వ జాతీయస్థాయి అండర్ 14 స్కూల్ గేమ్స్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొని మంచి ప్రతిభను కనబరిచి రాష్ట్రానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కర్నూల్ జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు టి లక్ష్మయ్య ,జె అరుణకుమారి, కరాటే శిక్షకుడు ఆరిఫ్, తండ్రి టి. కిషోర్, ఫయాజ్ తదితరులు పాల్గొని టి లక్షిత్ కిషోర్ కు అభినందనలు తెలియజేశారు.