BREAKING
మౌలాలిలో...'లైఫ్ టోన్' మల్టీస్పెషాలిటీ, మల్టీ డిసిప్లినరీ క్లినిక్స్‌ ప్రారంభం హజరైన మల్కాజిగిరి ఎంపీ ఎమ్మెల్యే సామాజిక సమస్యలపై అవగాహన సీనియర్ జిల్లా త్రోబాల్ జట్టుకు ఎంపికైన విశ్వం విద్యార్థులు : అభినందించిన కళాశాల చైర్మన్ ఎం.ప్రభాకర్ రెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు పురిటి బిడ్డలు మృతి ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌పై వివాదం.. భారత్‌లో నిషేధించాలని సినీ కార్మిక సంఘాల డిమాండ్! పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా: సర్పంచ్ సంధ్యా సుభాష్ గౌడ్ అన్నమయ్య జిల్లాలో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలు : ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వెల్లడి సాయి సన్నిధిలో కోటి దీపోత్సవం. యువత సవాళ్లను అవకాశాలుగా మార్చుకునేలా ప్రోత్సాహం గోవా చలనచిత్రోత్సవంలో అమల పాల్ ‘హాఫ్’ సందడి.. ఆ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు! 8వ మహా పడిపూజకు ఆర్. కృష్ణయ్యకు ఆహ్వానం ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే లక్ష్యం. కోట వీధిలో డ్రైనేజీ పనులు. వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి హరివరాసనం విశ్వమోహనం: శబరిమల ఆధ్యాత్మిక గీతం వెనుక విశేషాలు, వివాదాలు ఆధ్యాత్మిక సంస్కృతికి ప్రతీకలుగా సింహద్వారాలు: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్*

ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే లక్ష్యం. కోట వీధిలో డ్రైనేజీ పనులు.

Select Suryaa Now
ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే లక్ష్యం. కోట వీధిలో డ్రైనేజీ పనులు.

**కళ్యాణదుర్గం:** పట్టణంలోని 24వ వార్డును పరిశుభ్రతలో ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కౌన్సిలర్ పార్వతి రామన్న ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆదేశాల మేరకు మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డు కోట వీధిలో పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పారిశుద్ధ్య కార్మికుల సహకారంతో వీధుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించడంతో పాటు రోడ్లు, డ్రైనేజీలను శుభ్రం చేయిస్తున్నారు. ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో వార్డులో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. కోట వీధిలోని రహదారులు, మురుగునీటి కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తూ కార్మికులు శుభ్రత పనులు చేపడుతున్నారు. డ్రైనేజీల్లో మురుగునీరు సక్రమంగా ప్రవహించేలా పూడికను తొలగించడం, రోడ్లపై చెత్తాచెదారం లేకుండా చూడటం వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పారిశుద్ధ్య లోపం కారణంగా దోమలు, ఈగలు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ పార్వతి రామన్న మాట్లాడుతూ 24వ వార్డులో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్లు, డ్రైనేజీలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మున్సిపాలిటీలోనే 24వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రజాప్రతినిధిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ వార్డులోని ప్రతి వీధిలో శుభ్రత పనులు చేపట్టేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సహకారం, సూచనలతో వార్డు అభివృద్ధితో పాటు పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను రోడ్లపై, డ్రైనేజీల్లో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వార్డును నిర్మించగలమని పేర్కొన్నారు. కోట వీధిలో చేపట్టిన పారిశుద్ధ్య పనులపై స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇలాంటి శుభ్రత కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని కోరుతున్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి