BREAKING
మౌలాలిలో...'లైఫ్ టోన్' మల్టీస్పెషాలిటీ, మల్టీ డిసిప్లినరీ క్లినిక్స్‌ ప్రారంభం హజరైన మల్కాజిగిరి ఎంపీ ఎమ్మెల్యే సామాజిక సమస్యలపై అవగాహన సీనియర్ జిల్లా త్రోబాల్ జట్టుకు ఎంపికైన విశ్వం విద్యార్థులు : అభినందించిన కళాశాల చైర్మన్ ఎం.ప్రభాకర్ రెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు పురిటి బిడ్డలు మృతి ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌పై వివాదం.. భారత్‌లో నిషేధించాలని సినీ కార్మిక సంఘాల డిమాండ్! పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా: సర్పంచ్ సంధ్యా సుభాష్ గౌడ్ అన్నమయ్య జిల్లాలో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలు : ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వెల్లడి సాయి సన్నిధిలో కోటి దీపోత్సవం. యువత సవాళ్లను అవకాశాలుగా మార్చుకునేలా ప్రోత్సాహం గోవా చలనచిత్రోత్సవంలో అమల పాల్ ‘హాఫ్’ సందడి.. ఆ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు! 8వ మహా పడిపూజకు ఆర్. కృష్ణయ్యకు ఆహ్వానం ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే లక్ష్యం. కోట వీధిలో డ్రైనేజీ పనులు. వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి హరివరాసనం విశ్వమోహనం: శబరిమల ఆధ్యాత్మిక గీతం వెనుక విశేషాలు, వివాదాలు ఆధ్యాత్మిక సంస్కృతికి ప్రతీకలుగా సింహద్వారాలు: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్*

ఆధ్యాత్మిక సంస్కృతికి ప్రతీకలుగా సింహద్వారాలు: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్*

Select Suryaa Now
ఆధ్యాత్మిక సంస్కృతికి ప్రతీకలుగా సింహద్వారాలు: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్*
కొంపల్లి మేజర్ న్యూస్ జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని దేవమ్మ బస్తీ, పాపిరెడ్డినగర్ ఏ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల సింహద్వారాల (కమాన్ల) ప్రారంభోత్సవ కార్యక్రమాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై సింహద్వారాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ మాట్లాడుతూ మన ఆధ్యాత్మిక సంస్కృతి, ఆచార సంప్రదాయాలు, వారసత్వ వైభవాన్ని ప్రతిబింబించడంలో సింహద్వారాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే కమాన్లు భక్తి భావనను చాటడంతో పాటు ఆయా ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడంతో పాటు భక్తి, ఐక్యతా భావాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుతున్న మండపాల నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షుడు రుద్ర అశోక్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, గణేష్ మండపం కమిటీ అధ్యక్షుడు అంజయ్య, వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రావు, సంతోష్, ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్ చారి, మహేందర్ గౌడ్, జాయింట్ సెక్రెటరీ రాజేందర్ రెడ్డి, ట్రెజరర్ కుసుమ పరశురాం, ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మీనారాయణ, రామమూర్తి, ఆనంద్, రాములు, అంజిరెడ్డి, మల్లయ్య, బ్రహ్మచారి, రాంప్రసాద్, వేణుకుమార్, కాలనీవాసులు బసవేశ్వర్ మహేందర్ గౌడ్, శ్యాంసుందర్, సిద్ధి రాంరెడ్డి, వెంకట్రావు, తెరాల శ్రీనివాస్‌తో పాటు స్థానిక నాయకులు ఆజాం, శేషిధర్, బ్రహ్మానంద చారి, హనుమంతు, వెంకటేష్, నాగరాజు, సాజిద్, కాలనీవాసులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.