సాయి సన్నిధిలో కోటి దీపోత్సవం.
బాబాకు ప్రత్యేక అభిషేకాలు వ్రతాలు.. చింతపల్లి మేజర్ న్యూస్. కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా చింతపల్లి సాయి సన్నిధిలో మంగళవారం రాత్రి కోటి దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం బాబాకు ప్రత్యేక అభిషేకాలు పూజలు చేశారు. మధ్యాహ్నం సత్యనారాయణ స్వామి వ్రతాలు భక్తులు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. సాయంత్రం కోటి దీపోత్సవం నిర్వహించారు. వందలాది మంది బాబాను దర్శించుకున్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మంచికంటి .పావని ధనుంజయ దంపతులు, ఆలయ ట్రస్ట్ సభ్యులు వెంకటయ్య, కృష్ణయ్య, పుల్లారెడ్డి, శ్రీనివాస్, అయ్యప్ప భక్తులు, వందలాదిమంది భక్తులు తదితరులు ఉన్నారు.