మల్కాజిగిరి,మేజర్ న్యూస్ : మౌలాలి కమాన్ సమీపంలో నూతనంగా నిర్మించిన'లైఫ్ టోన్' మల్టీస్పెషాలిటీ, మల్టీ డిసిప్లినరీ క్లినిక్స్‌ను బుధవారం మల్కాజిగిరి పార్లమెం ట్ సభ్యులు ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు . ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ,ఈ ఆసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి, వారి హృద యాల్లో సుస్థిర స్థానం సంపాదించు కోవాలని, ఈ సంస్థ మరింత గొప్పగా అభివృద్ధి చెందా లని ఆకాంక్షించారు. మౌలాలిలో ఇలాంటి క్లినిక్‌ను ఏర్పాటు చేయడంపై హర్షనీయమ న్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు అధికంగా నివసించే ప్రాంతం మౌలాలి అని, 'గంగా-జమునా తహజీబ్' (మత సామరస్యం) వంటి గొప్ప సంస్కృతి ఇక్కడి ప్రజలలో ఉందన్నారు. చిన్న వయసులోనే వైద్య విద్యను పూర్తి చేసుకొని ప్రజా సేవలోకి వచ్చిన డాక్టర్లను అభినందించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిం చడానికి మౌలాలి కమాన్ సమీపంలో
'లైఫ్ టోన్' మల్టీస్పెషాలిటీ, మల్టీ డిసిప్లినరీ క్లినిక్స్‌ను ఏర్పాటు చేసిన నిర్వాహకులు, వైద్య బృందాన్ని అభినందించారు. నూత నంగా ప్రారంభించిన ఈ వైద్య కేంద్రం ద్వారా మౌలాలి పరిసర ప్రాంతాల ప్రజలకు మెరు గైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలను అందిస్తూ, వైద్య రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకో వాలని ఎమ్మెల్యే, నిర్వాహకులకు సూచించా రు.ఈ కార్యక్రమంలో మౌలాలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గున్నాల సునీత శేఖర్ యాదవ్, హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ మేఘన, డాక్టర్ ఆకాష్, డాక్టర్ శ్రీవాణి, డాక్టర్ హేమం త్, డాక్టర్ ఆదిల్ పాషా, బీఆర్ఎస్ గ్రేటర్ మాజీ కార్యదర్శి అమీనుద్దీన్, సీనియర్
నాయకులు భాగ్యనందరావు, తోట నాగేశ్వ రరావు, ఉస్మాన్, జోగు శ్రీనివాస్, జేఏసీ వెంకన్న, ఇబ్రహీం, మారుతీప్రసాద్,
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ కే శ్రీనివాస్, సీనియర్ నాయకులు గున్నాల చంద్రశేఖర్ యాదవ్, మౌలాలి డివిజన్ అధ్యక్షులు శివ, జై శ్రీరాం కిరణ్, మైనారిటీ నేత ఎంఏ ఖుద్ధూస్ తదితరులు పాల్గొన్నారు.