అన్నమయ్య జిల్లాలో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలు : ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వెల్లడి
మదనపల్లి,మేజర్ న్యూస్ : పంచాయతీ ఎన్నికల దృష్ట్యా బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉన్నట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాపురం,సంబేపల్లి మండలాల్లో నవంబర్ 26న పోలింగ్ ఉన్నందున ఈ ఆంక్షలు విధించారు.నవంబర్ 25 రాత్రి 7 నుండి 27 ఉదయం 6 గంటల వరకు లేదా కౌంటింగ్ ముగిసే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు.5 మందికి మించి గుమికూడటం,ర్యాలీలు,సభలు,ధర్నాలు,విజయోత్సవ ఊరేగింపులు నిషేధమన్నారు.కత్తులు,కర్రలు,తుపాకులు,పేలుడు పదార్థాలు,ఇతర ఆయుధాలు కలిగి ఉండటం,ప్రదర్శించడం నేరమన్నారు.పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో గుమికూడటం,ఓటర్లను ప్రభావితం చేయడం,అనధికార వాహనాలు నిషేధమన్నారు.అనుమతి లేని లౌడ్ స్పీకర్లు,బాణసంచా,రెచ్చగొట్టే బ్యానర్లు,మద్యం విక్రయం నిషేధం.నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి