BREAKING
2025–26లో 378.5 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి రాజ్యాంగంతోనే సమాన అవకాశాలు బ్రెజిల్ ఆర్థిక చర్యలపై లూలాతో ఆర్థిక మంత్రి భేటీ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో గర్వకారణం, ఆనందదాయకం: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్* ఇంకొల్లు మండలంలో సర్పంచ్‌లు వీరే మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు జీడీపీ డేటాపై ట్రంప్ సంచలన ఆరోపణలు రష్యా రాయబారితో చర్చల ప్రణాళికపై జర్మనీ ఏఎఫ్‌డీ సహ-అధ్యక్షుడి విమర్శలు ఫ్రాన్స్‌లో పెరుగుతున్న సమస్యలు.. అధ్యక్ష రేసులో పోటెత్తుతున్న అభ్యర్థులు కార్పొరేట్ బాండ్ ఇండెక్స్ ఫ్యూచర్స్‌కు ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్ విద్యుదీకరణ లక్ష్యంపై దేశాలు, సంస్థల సమైక్య ముందడుగు 2025–26లో 253.81 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి మంగళగిరిలో మునిసిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు బిజీబిజీ : ఎన్నికల సరళిని పరిశీలించిన తెలుగు యువత రథసారధి ఐఐటీఎఫ్ 2026లో ఆయుష్ పెవిలియన్ సందడి సాగర్ నుంచి ప్రపంచ వేదికపైకి.. హైదారాబాద్ యాచ్ క్లబ్‌కు ప్రతిష్ఠాత్మక వరల్డ్ సెయిలింగ్ ఇంపాక్ట్ అవార్డు! మాజీ లోక్‌సభ స్పీకర్ రబీ రే జయంతి

పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీయాలి డీఈవో ఎల్ సుధాకర్ డిసెంబర్ 9,10 తేదీల్లో కర్నూలు బాలోత్సవం పిల్లలు కేవలం చదువుకే పరిమిత కాకుండా ఆటలు సాంస్కృతిక అంశాల పైన కూడా మక్కువ పెంచాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ సుధాకర్ తల్లిదండ్రులను కోరారు . బాలోత్సవ ఉత్సవాలో నిర్వహించే పోటీలలో పిల్లల్లో దాగీ ఉ

Select Suryaa Now
పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీయాలి  డీఈవో ఎల్ సుధాకర్   డిసెంబర్ 9,10 తేదీల్లో కర్నూలు బాలోత్సవం   పిల్లలు కేవలం చదువుకే పరిమిత కాకుండా  ఆటలు సాంస్కృతిక అంశాల పైన కూడా మక్కువ పెంచాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ సుధాకర్ తల్లిదండ్రులను కోరారు . బాలోత్సవ ఉత్సవాలో నిర్వహించే పోటీలలో పిల్లల్లో దాగీ ఉ


పిల్లలు కేవలం చదువుకే పరిమిత కాకుండా  ఆటలు సాంస్కృతిక అంశాల పైన కూడా మక్కువ పెంచాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ సుధాకర్ తల్లిదండ్రులను కోరారు . బాలోత్సవ ఉత్సవాలో నిర్వహించే పోటీలలో పిల్లల్లో దాగీ ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు చక్కటి అవకాశం అని పేర్కొన్నారు. బుధవారం కర్నూల్ నగరంలోని ఏ క్యాంపు మోంటెస్సోరి లో డిసెంబర్ 9 10 తేదీల్లో ఇండస్ మాంటో సరి పాఠశాలలో నిర్వహించే 6వ కర్నూల్ బాలోత్సవాల  పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అధ్యక్షుడు జంధ్యాల రఘుబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ సుధాకర్ తో పాటుఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు జి పుల్లయ్య ,ప్రధాన కార్యదర్శి డి ధనుంజయ, ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ బి శంకర్ శర్మ మాంటిస్సోరి విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ కృష్ణమోహన్ ప్రధానోపాధ్యాయులు జ్యోతి ,ఇండస్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు మీనాక్షి 
రవీంద్ర టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్ పిబీవీ సుబ్బయ్య, యుటిఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు కే సురేష్ కుమార్ జిల్లా అధ్యక్షుడు బిడి సుధీర్ రాజు, సమతా జిల్లా కన్వీనర్ రమాదేవి, కల్లూరు ఎమ్ఈఓ వనజ కుమారి, లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు . డీఈవో మాట్లాడుతూ చిన్నప్పటి నుండి తనకు క్రీడలు కలలు అంటే ఎంతో ఇష్టమన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే వాటిపై ఆసక్తి పెంచుకోవడం జరిగిందన్నారు. కేవలం చదువుకే పరిమితం కాకుండా ఇలాంటి అంశాలపై విద్యార్థులు దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. బాలోత్సవ వేడుకలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు. ఇలాంటి వేడుకల్లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయాలని కోరారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను నిరూపించుకునేందుకు ఇలాంటి వేడుకలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు విద్యాశాఖ సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. జి పుల్లయ్య మాట్లాడుతూ కర్నూలు లో దాదాపుగా 5 బారోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు ప్రతి ఏడాది విభిన్న అంశాలతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కేవలం ప్రైవేట్ పాఠశాలలే కాకుండా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేస్తున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్ బి శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులను కేవలం చదివే కాకుండా ఆటల పాటల కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం చేయాలని తల్లిదండ్రులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ఉత్సవాల నిర్వహణకు ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు. మీనాక్షి మాట్లాడుతూ మాంటెస్సోరి స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహణతో పాటు బాలోత్సవ ఉత్సవాలను నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ధనుంజయ మాట్లాడుతూ బాల ఉత్సవ ఉత్సవాలను విస్తరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పలు రకాల అంశాలతో ఈ ఉత్సవాలను ప్రతి ఏడాది నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆరవ కర్నూల్ బాలోత్సవ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు దృష్టి సారించామన్నారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవ కమిటీ కోశాధికారి రంగస్వామి నాయకులు ఎలాగువేరా ఎంబి  బసవరాజు తదితరులు పాల్గొన్నారు