వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి
దోమ, మేజర్ న్యూస్: దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామంలో నిర్వహించిన వివాహ వేడుకకు పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దోమ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శాంతు కుమార్, రామకృష్ణ, ధనేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.