BREAKING
ఫహాద్ ఫాజిల్, ప్రేమ్ కుమార్ క్రేజీ కాంబినేషన్.. ‘అసరీరి’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్! సుస్థిర అభివృద్ధికి భూవిజ్ఞాన శాస్త్రాలే కీలకం ఈఎస్సీఐలో మూడు రోజుల జాతీయ సదస్సు  ప్రారంభం మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.... బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని యువతి దుర్మరణం పౌల్ట్రీ రంగానికి సింగిల్ విండో విధానం రాజీవ్, సోనియా గాంధీ జ్ఞాపకాలను గుర్తుచేసిన రితేష్ జెనీలియా ఫోటో.. సోషల్ మీడియాలో రచ్చ! వేడుకగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర రెడ్డి పుట్టినరోజు : శుభాకాంక్షలు తెలిపిన కూటమి నేతలు,కార్యకర్తలు 200 కిలోమీటర్ల పాదయాత్ర.. శబరిమల చేరిన బౌరంపేట్ అయ్యప్ప భక్తుడు కూతురి పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు మ్యూచువల్ ఫండ్స్‌లోకి మళ్లించారంటూ ఆరోపణ.. వడ్డీ రాక.. అసలులో కోతలంటూ బాధితుడి ఆవేదన 29న ఎస్ఐఓ బహిరంగ సభ' ఎమ్మెల్యే సమక్షంలో టిడిపిలో చేరిన మైనార్టీ నాయకులు : తాజ్ బాషాను సాదరంగా ఆహ్వానించిన షాజహాన్ బాషా మాయన్ చాప్టర్ 1: కరుత్తచ్చన్ నేపథ్యంలో కొత్త ప్రపంచం.. జితిన్ కె జోస్ ఆసక్తికర విషయాలు! మౌలాలిలో...'లైఫ్ టోన్' మల్టీస్పెషాలిటీ, మల్టీ డిసిప్లినరీ క్లినిక్స్‌ ప్రారంభం హజరైన మల్కాజిగిరి ఎంపీ ఎమ్మెల్యే సామాజిక సమస్యలపై అవగాహన సీనియర్ జిల్లా త్రోబాల్ జట్టుకు ఎంపికైన విశ్వం విద్యార్థులు : అభినందించిన కళాశాల చైర్మన్ ఎం.ప్రభాకర్ రెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు పురిటి బిడ్డలు మృతి

యువత సవాళ్లను అవకాశాలుగా మార్చుకునేలా ప్రోత్సాహం

Select Suryaa Now
యువత సవాళ్లను అవకాశాలుగా మార్చుకునేలా ప్రోత్సాహం

తెలంగాణ బ్యూరో , ప్రతినిధి : ‎బిఎంఎల్. ముంజాల్ విశ్వవిద్యాలయం (బి.ఎం.యు) వారు, వారి ప్రతిష్టాత్మక దేశవ్యాప్త అంతర్-పాఠశాల ఆవిష్కరణ, వ్యాపారనేత్తృత్వం పోటీ అయిన 'హీరోస్ ఆఫ్ టుమారో (హెచ్ఒటి) 2026' ని హీరో గ్రూప్ చొరవగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ప్రాంతీయ పోటీలను, మియాపూర్‌లోని మెరు ఇంటర్నేషనల్ స్కూల్‌ నాలెడ్జ్ భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించింది. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఒక జాతీయ వేదికను అందిస్తోంది. ఈ రౌండ్‌లో హైదరాబాద్‌లోని 14 పాఠశాలల నుంచి 27 జట్లకు చెందిన 100 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.ఈ జ్యూరీలో శరత్ ముత్యాల, ఎన్ఐ-ఎంఎస్ఎంఇ సెంటర్ హెడ్; జి. రాజశేఖర్ గంటా, జీరోమ్యాటర్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సహ-వ్యవస్థాపకులు; డాక్టర్ హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుంచి అర్థశాస్త్రంలో పిహెచ్.డి పట్టా పొంది, విద్యా, సంస్థాగత నాయకత్వంలో 15 ఏళ్ళకు పైగా అనుభవం ఉన్న నిష్ణాతుడైన విద్యావేత్త, ఆర్థికవేత్త, విద్యావిషయక నేత ఎమ్మాడి నవీన్ కుమార్, ఉన్నారు. బాచుపల్లిలోని యూనిసెంట్ స్కూల్ వారి 'రెస్క్యూర్', గంగాస్ వ్యాలీ స్కూల్ వారి 'సైన్‌వర్స్', ది ప్రేమియా అకాడమీ వారి 'ఎకోగార్డ్' వంటి ప్రతిపాదనలు ప్రత్యేకంగా నిలిచాయి. హైదరాబాద్ నుంచి జాతీయ గ్రాండ్ ఫైనల్‌కు అర్హత సాధించిన ఐదు జట్లు: బాచుపల్లిలోని యూనిసెంట్ స్కూల్, గంగాస్ వ్యాలీ స్కూల్, ది ప్రేమియా అకాడమీ, అల్వాల్‌లోని సెయింట్ మైఖేల్స్ స్కూల్, పేజ్ జూనియర్ కాలేజ్. బిఎంఎల్ ముంజాల్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ - స్ట్రాటజీ & గ్రోత్, ప్రొఫెసర్ దవీందర్ సింగ్, హైదరాబాద్ రీజనల్స్ గురించి మాట్లాడుతూ, “హీరోస్ ఆఫ్ టుమారో విద్యార్థులకు వ్యవస్థాపక దృక్పథాన్ని పెంపొందించుకుంటూ, వారి ఆలోచనలను అర్థవంతమైన పరిష్కారాలుగా మార్చుకునే అవకాశాన్ని అందిస్తుంది. విజయాలను సాధించడం ఎంత ముఖ్యమో, వైఫల్యాల నుంచి నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యమని మేము నమ్ముతాం. ఎందుకంటే ఇది యువతను ప్రయోగాలు చేయడానికి, పరిస్థితులకు అనుగుణంగా మారడానికి, సవాళ్లను ఎదుర్కోవడానికి, కొత్త మార్గాలను కనుగొనడానికి ప్రోత్సహిస్తుంది. హైదరాబాద్ రీజనల్స్ లో విద్యార్థులు ప్రదర్శించిన ఉత్సాహం, సృజనాత్మకత, సమాజంపై సానుకూల ప్రభావాన్ని సృష్టించగల సమస్య పరిష్కర్తలను పోషించాల్సిన ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తాయి” అన్నారు.